News July 21, 2024
నెల్లూరు: తొలిసారిగా ‘అధ్యక్షా’ అనబోయే MLAలు వీరే
ఉమ్మడి నెల్లూరు జిల్లాతో పాటు కందుకూరు నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఆరుగురు రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో అధ్యక్షా..అనే పదం పలకబోతున్నారు. పొంగూరు నారాయణ, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కాకర్ల సురేశ్, కావ్య కృష్ణారెడ్డి, నెలవల విజయశ్రీ, ఇంటూరి నాగేశ్వరరావు తొలిసారిగా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. నారాయణ గతంలో MLCగా, మంత్రిగా వ్యవహరించినా ఎమ్మెల్యేగా తొలిసారి సభలో అడుగుపెడుతున్నారు.
Similar News
News October 6, 2024
అన్నపూర్ణగా శ్రీ రాజరాజేశ్వరి
నెల్లూరులో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో 50వ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. అంగరంగ వైభవంగా జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారు శ్రీ అన్నపూర్ణ అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. వేలాదిగా తరలివస్తున్న భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ ఏసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
News October 6, 2024
గూడూరు: బాలికలో అసభ్యకర ప్రవర్తన..కేసు నమోదు
తిరుపతి(R)పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పొక్సో కేసు నమోదు చేసినట్లు CI.చిన్నగోవిందు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. గూడూరు మండలానికి చెందిన ప్రసాద్ (50)కొంతకాలంగా తిరుపతి(R)మండలం గాంధీపురంలో ఉండి తాపీ మేస్త్రీగా పనిచేస్తూ జీవిస్తున్నాడు. అదే ప్రాంతంలో 3వ తరగతి చదువుతున్న బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. తల్లితండ్రులకు చెప్పడంతో దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
News October 6, 2024
బంగారు గరుడ వాహనంపై పెంచలస్వామి విహారం
స్వాతి నక్షత్రం సందర్భంగా రాపూరు మండలం పెంచలకోన క్షేత్రంలో శనివారం విశేష పూజలు నిర్వహించారు. శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి బంగారు గరుడ వాహనంపై కోన వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ఏర్పాట్లను ఆలయ డిప్యూటీ కమిషనర్ పోరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పర్యవేక్షించారు.