News October 23, 2024

నెల్లూరు: “దానా” ప్రభావంతో రైళ్లు రద్దు

image

“దానా” తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా మీదుగా ప్రయాణించే పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే నెల్లూరు, గూడూరులో ప్రయాణికులకు సౌకర్యార్థం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసింది. ప్రయాణికులు నెల్లూరు 0861- 2345863, గూడూరు 08624-250795 హెల్ప్ డెస్క్ నంబర్లలో సంప్రదించవచ్చని సూచించింది.

Similar News

News November 6, 2024

నెల్లూరు: అండర్ బ్రిడ్జ్ వద్ద నిలిచిన వర్షపు నీరు

image

నెల్లూరు పట్టణంలోని ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జ్‌లో వర్షపు నీరు నిలబడి వాహనాల రాకపోకలకు, పాద చారులు నడవడానికి ఆటంకం ఏర్పడింది. వర్షం వచ్చిన ప్రతిసారి ఇదే పరిస్థితి ఏర్పడుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే ఆ నీటిని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పోలీసులు ప్రజలకు సూచనలు చేస్తూ సహకరిస్తున్నారు.

News November 6, 2024

నెల్లూరు: ముగ్గురు ఎస్కార్ట్ సిబ్బందిపై వేటు  

image

విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు పోలీసు అధికారులపై వేటు వేసినట్లు SP కృష్ణ కాంత్ తెలిపారు. నెల్లూరులో ఓ వ్యక్తిపై పోక్సో కేసు నమోదు అయింది. ఆయనను ఎస్కార్ట్ పోలీసులు జైలు నుంచి కోర్టుకు తీసుకెళ్లారు. తిరుగు ప్రయాణంలో నిందితుడిని ఆయన ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ నిందితుడికి, ఆయన భార్యకు వాగ్వాదం జరిగింది. దీంతో ఆమె ఎస్పీకి  ఫిర్యాదు చేసింది.  SP ఎస్కార్ట్ పోలీసులను సస్పెండ్ చేశారు.

News November 6, 2024

నెల్లూరు: RTCలో 13 నుంచి ఇంటర్వ్యూలు

image

RTCలో అప్రెంటీస్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి. వెంకటాచలం మండలం కాకుటూరులోని ఆర్టీసీ జోనల్ శిక్షణ కళాశాలలో ఈ ఇంటర్వ్యూలు ఉంటాయని ఆ కళాశాల ప్రిన్సిపల్ వి. శ్రీధర్ తెలిపారు. ప్రకాశం జిల్లాకు సంబంధించి 13వ తేదీ, నెల్లూరుకు 14వ తేదీ, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు 15వ తేదీ ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు.