News July 10, 2024
నెల్లూరు: దివ్యాంగురాలిపై అత్యాచారం.. యువకుడు అరెస్ట్
రాపూరుకు చెందిన ఓ మానసిక దివ్యాంగురాలిపై అదే కాలనీకి చెందిన ప్రేమ్ కుమార్ (25) అనే యువకుడు ఎవరూ లేని సమయంలో అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటనపై బాధితురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై మాల్యాద్రి కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి విచారిస్తున్నారు. కాలనీవాసులు మాట్లాడుతూ.. ఆ ఓ మానసిక దివ్యాంగురాలికి అమ్మానాన్న ఎవరూ లేరని, ఉన్న ఒక అన్న కూడా వికలాంగుడేనన్నారు.
Similar News
News October 6, 2024
బంగారు గరుడ వాహనంపై పెంచలస్వామి విహారం
స్వాతి నక్షత్రం సందర్భంగా రాపూరు మండలం పెంచలకోన క్షేత్రంలో శనివారం విశేష పూజలు నిర్వహించారు. శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి బంగారు గరుడ వాహనంపై కోన వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ఏర్పాట్లను ఆలయ డిప్యూటీ కమిషనర్ పోరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పర్యవేక్షించారు.
News October 5, 2024

నెల్లూరు: ఏఎంసీల నియామకాలకు సన్నాహాలు
ఏఎంసీ పాలకవర్గాల నియామకానికి కసరత్తు మొదలైంది. జిల్లాలో నెల్లూరు సిటీ మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాలకు వ్యవసాయ మార్కెట్ కమిటీల నియామకం చేపట్టాల్సి ఉంది. ఈ మేరకు ఎమ్మెల్యేలు సన్నాహాలు చేపట్టారు. ఛైర్మన్లు, సభ్యుల నియామకానికి వడపోతల ప్రక్రియలో నిమగ్నమయ్యారు. జనసేన, బీజేపీ నేతలు కూడా కొన్ని పదవులు ఆశిస్తున్నారు. కాగా నెల్లూరు రూరల్‌కు సంబంధించి మనుబోలు శ్రీధర్ రెడ్డి పేరు దాదాపు ఖరారైంది.