News August 6, 2024

నెల్లూరు: నగదు మోసాలపై ఫిర్యాదుల వెల్లువ

image

జిల్లాలో నగదు మోసాలే అధికంగా జరుగుతున్నాయి. ఉమేష్ చంద్ర పోలీసు కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 119 మంది వారికి జరిగిన అన్యాయాలపై ఫిర్యాదులు చేశారు. వీటిలో రూ. 12 కోట్ల విరాళం ఇస్తామని రూ.18 లక్షలు కాజేసారని, స్నేహితులతో భాగస్వామిగా ఉన్న కంపెనీలో కుమారుడు చనిపోతే డబ్బులు ఇవ్వకుండా బెదిరిస్తున్నట్లు, రూ.8 లక్షలకు పసుపు అమ్మితే డబ్బులు ఇవ్వడంలేదని ఫిర్యాదులు వచ్చాయి.

Similar News

News December 1, 2025

నెల్లూరు: అసంతృప్తిలో కూటమి నాయకులు..!

image

నెల్లూరు జిల్లాలోని కూటమి నాయకుల్లో అసంతృప్తి చెలరేగుతోంది. అధికారంలోకి వచ్చేందుకు కష్టపడి పనిచేసిన తమను మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రతి పనికి మంత్రులు, MLAలే కాంట్రాక్టర్లుగా మారుతున్నారని వాపోయారు. తమకంటూ ఏ పనులు ఇవ్వడం లేదని వాపోతున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఇలాగే ఉందని చెబుతున్నారు. ఈ ప్రభావం స్థానిక ఎన్నికలపై ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.

News December 1, 2025

గూడూరులో దారుణం

image

భార్య, అత్త కలిసి భర్తపై వేడివేడి నూనె పోసిన ఘటన గూడూరు ఇందిరానగర్‌లో జరిగింది. భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందంటూ భర్త వారం నుంచి గొడవలు పడుతున్నాడు. ఈక్రమంలో భర్త తన బిడ్డలను చూడటానికి గూడూరులోని ఇందిరానగర్‌కు వెళ్లాడు. వేడి నూనె తనపై పోసి చంపడానికి ప్రయత్నం చేశారని బాధితుడు ఆరోపించారు. బంధువులు అతడిని ఆసుపత్రికి తరలించారు.

News December 1, 2025

నెల్లూరు: కుమారుడిని చంపిన తండ్రి

image

ఈ ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బట్టేపాడులో సోమవారం జరిగింది. స్థానిక దళితవాడకు చెందిన మామిడూరు పుల్లయ్యకు ఇవాళ ఉదయం పింఛన్ డబ్బులు వచ్చాయి. ఆ నగదు తనకు ఇవ్వాలని కుమారుడు మస్తానయ్య(33) తన తండ్రితో గొడవకు దిగాడు. ఈక్రమంలో తన చేతిలోని కర్రతో పుల్లయ్య కుమారుడిపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన మస్తానయ్య అక్కడికక్కడే చనిపోయాడు.