News April 25, 2024
నెల్లూరు నగరంలో యువకుడి దారుణహత్య

నెల్లూరు భక్తవత్సలనగర్‌కు చెందిన రామయ్య కుమారుడు దశరథ తాతతో కలిసి పుచ్చకాయల వ్యాపారం చేస్తున్నాడు. సోమవారం సాయంత్రం పని ఉందని ఇంట్లో నుంచి వెళ్లిన దశరథ తిరిగి రాలేదు. మంగళవారం ఆటోనగర్‌లో దశరథ మృతదేహం వెలుగుజూసింది. కత్తులతో తీవ్రంగా దాడిచేయడంతో దశరథ ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించి మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించి పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
Similar News
News October 28, 2025
కృష్ణపట్నం పోర్టులో 5వ ప్రమాదపు హెచ్చరిక జారీ

‘మెంథా’ తుఫాన్ నేపథ్యంలో కృష్ణపట్నం పోర్టులో సోమవారం సాయంత్రం 5వ ప్రమాదవ హెచ్చరిక ప్రకటన చేశారు. తుపాను 50 నుంచి 150 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు 5, 6వ నంబరు ప్రమాదకర సూచికలుగా పరిగణిస్తారు. గాలులు, అలలు పోర్ట్ పరిసరాల్లో ప్రభావం చూపుతాయని అర్థం. ఈ నంబర్ల హెచ్చరికలు జారీచేస్తే పోర్టులో కార్యకలాపాలన్నీ నిలిపేయాలి. కృష్ణపట్నం పోర్టులో కార్మికులకు సెలవు ఇవ్వకపోవడంపై పలువురు మండిపడుతున్నారు
News October 27, 2025
జిల్లా రెవెన్యూ అధికారిగా విజయ్ బాధ్యతలు

నెల్లూరు జిల్లా రెవెన్యూ అధికారిగా విజయ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. సోమవారం కలెక్టరేట్లోని డీఆర్ఓ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించిన ఆయనకు కలెక్టరేట్ పరిపాలన అధికారి తుమ్మా విజయ్ కుమార్ బొకే అందించి అభినందించారు. అనంతరం పలు సమస్యలను అయన దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని విజయ్ తెలిపారు.
News October 27, 2025
రేపు జూనియర్ కళాశాలలకు సెలవు: నెల్లూరు RIO

నెల్లూరు జిల్లాలో మంగళవారం అన్ని జూనియర్ కళాశాలకు సెలవు ప్రకటించినట్లు RIO వరప్రసాద్ రావు తెలిపారు. ‘మెంథా తుఫాన్’ నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు సెలవు ప్రకటించామన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. కాగా ఇప్పటికే స్కూళ్లు, అంగన్వాడీలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.


