News July 20, 2024
నెల్లూరు నగర కమిషనర్గా మల్లవరపు సూర్యతేజ

నెల్లూరు నగర కమిషనర్గా మల్లవరపు సూర్యతేజ నియమితులయ్యారు. ఏపీలో భారీగా IAS అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా మల్లవరపు సూర్యతేజ నెల్లూరు కమిషనర్గా బదిలీ అయ్యారు.
Similar News
News December 6, 2025
నెల్లూరు: చక్కెర కోటాకు “కత్తెర”..!

జిల్లాలో రేషన్ షాపుల ద్వారా కార్డుదారులకు 1/2 కేజీ చొప్పున ఇస్తున్న చక్కెర కోటాలో ఈ నెల కత్తెర పడింది. పలుచోట్ల చక్కెరను లేదంటూ.. డీలర్లు చేతులెత్తేస్తున్నారు. జిల్లాలో 1513 రేషన్ షాపుల పరిధిలో 7 లక్షల కార్డులు ఉండగా.. వీరికి ప్రతీ నెల 3500 మెట్రిక్ టన్నులు చక్కెర సరఫరా జరుగుతోంది. అయితే నెల స్టార్ట్ అయి 5 రోజులు గడుస్తున్నా.. కొన్ని చోట్ల ఇవ్వడం లేదు.
News December 6, 2025
నెల్లూరు: పెన్నా నదిలోకి దూకి మహిళ సూసైడ్

నెల్లూరులోని పెన్నా బ్రిడ్జి మీద నుంచి గుర్తు తెలియని మహిళ నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల నుంచి సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతురాలి వివరాలు తెలియక పోవడంతో వివరాలు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసిన నవాబ్ పేట పోలీసులు ఎవరికైనా వివరాలు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని వారు కోరారు.
News December 5, 2025
నెల్లూరు: ప్రభుత్వ అధికారి సస్పెండ్

దుత్తలూరు-1 VROగా పని చేస్తున్న చింతలచెరువు శ్రీనివాసులును సస్పెండ్ చేస్తూ జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ వివరాలను తహశీల్దార్ యనమల నాగరాజు వెల్లడించారు. గతంలో ఏరుకొల్లు VROగా పనిచేస్తున్న సమయంలో అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందకుండా చేయడంతో పాటు వారి పట్ల దురుసుగా ప్రవర్తించారని గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.


