News April 8, 2025
నెల్లూరు: నమ్మించి మోసం చేశాడు..!

కావలి ముసునూరుకు చెందిన చంద్రకాంత్ అనే వ్యక్తి తనను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని గుడ్లూరు పరిధికి చెందిన మహిళ సోమవారం ఎస్పీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసింది. నిందితుడు తన వద్ద రూ.3 లక్షల నగదు తీసుకున్నాడని, శారీకరంగా కలిశాక పెళ్లి చేసుకుందామని అడిగితే ముఖం చాటేస్తున్నాడని వాపోయింది. పోలీసులు విచారించి తనకు న్యాయం చేయాలని వేడుకుంది.
Similar News
News April 20, 2025
నెల్లూరు: హెల్త్ ఆఫీసర్ పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణ

నెల్లూరు కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ చైతన్య ఆదివారం బుల్లెట్ వాహనంపై పర్యటించి పారిశుద్ధ్య పనులు పర్యవేక్షించారు. ధనలక్ష్మిపురం, నారాయణ మెడికల్ కాలేజ్ రోడ్లలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులు పరిశీలించారు. మస్టర్లను పరిశీలించి శానిటేషన్ సెక్రటరీలకు సూచనలు చేశారు. కార్మికుల హాజరు శాతం తక్కువగా ఉండడంతో ఆదివారం కూడా పనికి వచ్చే కార్మికుల సంఖ్య తగ్గకుండా చూడాలని ఆదేశించారు.
News April 20, 2025
మనుబోలు: పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు

మనుబోలు మండలంలోని వడ్లపూడి వద్ద ఆదివారం కారు బోల్తా పడి అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో కారులో ఐదుమంది ఉన్నారు. వీళ్లంతా సురక్షితంగా బయటపడ్డారు. పొదలకూరు మండలం బిరదవోలు రాజుపాలెంకు చెందిన వారు కొత్త కారును కొనుగోలు చేసి గొలగమూడిలో పూజలు చేయించుకొని తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
News April 20, 2025
NLR: చెట్టును ఢీకొట్టిన బైక్.. యువతి మృతి

నెల్లూరు జిల్లాలో ఉదయాన్నే జరిగిన ప్రమాదంలో ఒకరు చనిపోయారు. మర్రిపాడు మండలం కదిరినాయుడు పల్లి సమీపంలో నెల్లూరు-ముంబయి జాతీయ రహదారిపై ఓ బైక్ చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకుపై ఉన్న యువతి అక్కడికక్కడే మృతిచెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.