News September 18, 2024
నెల్లూరు: నవోదయ ప్రవేశపరీక్షకు దరఖాస్తుల గడువు పెంపు

జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో చేరేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్షకు దరఖాస్తు గడువును సెప్టెంబర్ 23వ తేదీ వరకు పొడిగించినట్లు నవోదయ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు తెలిపారు. జిల్లాలోని 5వ తరగతి చదువుతున్న విద్యార్థులంతా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలు, సూచనలు, సలహాలు కొరకు 08985007588, 63004 29938 నంబర్లను సంప్రదించాలని కోరారు.
Similar News
News November 26, 2025
నెల్లూరు జిల్లాలో దారుణ హత్య

నెల్లూరు జిల్లాలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. జలదంకి మండలం గట్టుపల్లి చింతలపాలెం వద్ద తన కోళ్ల ఫారంలో నిద్రిస్తున్న టీడీపీ నేత గొట్టిపాటి ప్రసాద్ని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. ఘటనా స్థలానికి చేరుకొని జలదంకి పోలీసులు విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 26, 2025
నెల్లూరు జిల్లా ఇలా..

జిల్లా కేంద్రం: నెల్లూరు
నియోజకవర్గాలు: నెల్లూరు సిటీ, రూరల్, కావలి, కోవూరు, సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరి
మండలాలు(30):A.సాగరం, AS పేట, ఆత్మకూరు, మర్రిపాడు, సంగం, చేజర్ల, జలదంకి, SRపురం, ఉదయగిరి, V.పాడు, వింజమూరు, దుత్తలూరు, కలిగిరి, కొండాపురం, బుచ్చి, ఇందుకూరుపేట, కొడవలూరు, విడవలూరు, కోవూరు, అల్లూరు, కావలి, దగదర్తి, బోగోలు, పొదలకూరు, మనుబోలు, ముత్తుకూరు, వెంకటాచలం, TP గూడూరు, నెల్లూరు సిటీ, రూరల్
News November 26, 2025
నెల్లూరులో విషాదం.. భార్యతో గొడవపడి భర్త సూసైడ్

నెల్లూరు రూరల్లోని కోడూరుపాడు గిరిజన కాలనీలో విషాదం చోటుచేసుకుంది. భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదం నింపింది. భార్య అఫ్రిన్తో గొడవపడిన భర్త చెంచయ్య ఈనెల 23వ తేదీ పురుగుల మందు తాగాడు. గమనించిన భార్య అతడిని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. చికిత్స పొందుతూ చెంచయ్య ఇవాళ మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు రూరల్ పోలీసులు తెలిపారు.


