News February 19, 2025
నెల్లూరు: నష్టపరిహారం ఇవ్వాలని వినతి

నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ నేత మిడతల రమేశ్ కోరారు. ఈ మేరకు నెల్లూరు ఆర్డీవో కార్యాలయ డీఏవో అనిల్‌కు వినతిపత్రం అందజేశారు. దుగ్గుంట, వావింటపర్తి, అంకుపల్లి పంచాయతీలో రైల్వే లైన్ రాళ్లు నాటి నాలుగేళ్లు దాటిందన్నారు. భూములు కోల్పోతున్న రైతులకు మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
Similar News
News March 28, 2025
కాకాణి ముందస్తు బెయిల్‌పై హై కోర్ట్ కీలక ఆదేశాలు

తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించిన కాకాణి పిటిషన్‌పై కోర్ట్.. పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వరదాపురం పరిధిలోని ప్రభుత్వ భూమిలో కాకాణి అక్రమంగా మైనింగ్ చేశారంటూ అధికారుల ఫిర్యాదు మేరకు ఈ నెల 16న ఆయనపై కేసు నమోదైంది. దీనిపై బెయిల్ కోరుతూ కాకాణి కోర్టుకు వెళ్లగా.. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను తమకు సర్పించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.
News March 28, 2025
హీరోను అంటూ నమ్మించి దారుణం.. కేసు నమోదు

సినీ హీరోను అంటూ నమ్మించి మహిళను మోసం చేసిన ఘటనలో యువకుడిపై నెల్లూరు చిన్న బజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుపతి(D) కోట మండలానికి చెందిన ఓ మహిళ భర్త నుంచి విడిపోయింది. నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తోంది. ఆమెకు ఇన్‌స్టాలో సునీల్ రెడ్డి పరిచయం అయ్యాడు. హీరోను అంటూ నమ్మించి శారీరకంగా దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకోమని కోరగా ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫొటోలతో సునీల్ బెదిరించి దాడి చేశాడు.
News March 28, 2025
నెల్లూరు జిల్లా ప్రజలకు గమనిక

ప్రభుత్వం గ్యాస్ సబ్సిడీ నగదును లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా జమ చేస్తుందని జాయింట్ కలెక్టర్ కార్తీక్ తెలిపారు. దీపం 2 స్కీం కింద లబ్ధిదారులు సబ్సిడీ అమౌంట్ తమ ఖాతాలో జమ అయిందా లేదా అని https://epds2.ap.gov.in/lpgDeepam/epds పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చని చెప్పారు. వినియోగదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవలసిందిగా జాయింట్ కలెక్టర్ కార్తీక్ కోరారు.