News March 21, 2025
నెల్లూరు: నిరుపేద కుటుంబం.. ఆల్ ఇండియా ర్యాంకు

ఉదయగిరి మండలం జి. చెర్లోపల్లి వడ్డిపాలెం గ్రామానికి చెందిన వెంకటయ్య, నరసమ్మ దంపతుల కుమారుడు శేఖర్ ఆల్ ఇండియా లెవెల్‌లో GATE ECE గ్రూపులో 425వ ర్యాంక్ సాధించారు. శేఖర్ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోగా.. తల్లి కూలి పనులకు వెళ్లి శేఖర్‌ని చదివించింది. ఎలాంటి కోచింగ్ లేకుండానే GATE పరీక్ష రాసి తొలిప్రయత్నంలోనే జాతీయస్థాయి ర్యాంకు సాధించాడు. IITలో M.Tech చేసి మంచి జాబ్ సాధించడమే లక్ష్యమని శేఖర్ అన్నారు.
Similar News
News February 25, 2026
ఆ భూములను కాపాడండి: అసెంబ్లీలో సోమిరెడ్డి

సర్వేపల్లిలో హైవే పక్కన రూ.100కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాపాడాలని MLA సోమిరెడ్డి కోరారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘సర్వేపల్లిలో గత ఐదేళ్లు చాలా ఘోరాలు జరిగాయి. MSME పార్కు పేరుతో 50 ఎకరాలు, సూరాయపాలెంలో 30 ఎకరాలు, కొమ్మలపూడిలో 19 ఎకరాల భూమిలో స్కామ్ జరిగింది. దీనిపై ఏమైనా చర్యలు మొదలె పెడితే కోర్టుకెళ్లి స్టే తెచ్చుకుంటున్నారు. దీనిపై రెవెన్యూ మంత్రి సమీక్ష చేయాలి’ అని ఆయన విన్నవించారు.
News February 25, 2026
రేపే నెల్లూరుకు జగన్.. టైమింగ్స్ ఇవే!

మాజీ సీఎం జగన్ నెల్లూరులో గురువారం పర్యటించనున్నారు. ఉదయం 9గంటలకు పులివెందుల నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి నెల్లూరు రూరల్ కనుపర్తిపాడు జడ్పీ హైస్కూల్లోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 10.10 గంటలకు రోడ్డు మార్గం ద్వారా గొలగమూడి రోడ్డులోని VPR కన్వెన్షన్ హాలుకు వస్తారు. అక్కడ వివాహ వేడుకల్లో పాల్గొని 10.45 గంటలకు బెంగళూరు వెళ్తారు.
News February 25, 2026
వలేటివారిపాలెం: జనార్ధన స్వామి ఆలయంలో గుప్త నిధుల తవ్వకాలు

వలేటివారిపాలెం – చుండి మధ్య 167బి జాతీయ రహదారి పక్కనే ఉన్న జనార్ధన స్వామి ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం రాత్రి తవ్వకాలు చేపట్టారు. ఆలయ పక్కన ఉన్న మండపంలో సుమారు 10 అడుగుల లోతున గుంత తీయడం స్థానికంగా కలకలం రేపింది. గతంలోనూ ఇలాంటి ఘటనలు రెండు మూడు సార్లు జరిగాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. చారిత్రక దేవాలయాలను కాపాడాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.


