News November 9, 2024
నెల్లూరు నేతలకు కీలక పదవులు
రెండో విడత నామినేటెడ్ పోస్టుల్లో నెల్లూరు నేతలకు కీలక పదవులు లభించాయి.
➤ పోలంరెడ్డి దినేశ్ రెడ్డి: AP ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్ కార్పొరేషన్
➤ఆనం వెంకట రమణా రెడ్డి: AP స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ
➤ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి- నుడా
➤ సురేశ్ (BJP): APSRTC నెల్లూరు రీజనల్ బోర్డ్ ఛైర్మన్
Similar News
News December 3, 2024
సంగం బ్యారేజీ నుంచి నీరు విడుదల
నెల్లూరు జిల్లా సంగం బ్యారేజి నుంచి దిగువకి ఐదు వేల క్యూసెక్కుల నీటిని అధికారులు సోమవారం సాయంత్రం విడుదల చేశారు. ముందుగా పెన్నా పరివాహక ప్రాంతాలను అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. ఆయా గ్రామాలలో అధికారులు దండోరా వేయించి సిబ్బందిని అప్రమత్తం చేశారు. చేపలు పట్టే వారు, పశువుల కాపరులు ఎవరూ పెన్నానది వద్దకు వెళ్లకూడదని తహశీల్దార్ సోమ్లా నాయక్, సీఐ వేమారెడ్డి హెచ్చరికలు జారీచేశారు.
News December 3, 2024
పీఎస్ఎల్వీ సీ -59 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్
భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీహరికోట షార్ నుంచి ఈనెల 4వ తేదీన పీఎస్ఎల్వీ సీ – 59రాకెట్ ను ప్రయోగించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2.38గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభించనున్నట్లు శాస్రతవేత్తలు తెలియజేశారు. కౌంట్ డౌన్ కొనసాగిన తరువాత 4వ తేదీన సాయంత్రం 4.08 గంటలకు ప్రయోగించనున్నారు. సోమవారం ఎంఆర్ఆర్ సమావేశం నిర్వహించారు. మొదటి ప్రయోగ వేదికలో అనుసంధాన పనులు జరుగుతున్నాయి.
News December 2, 2024
రేపు సూళ్లూరుపేటకు జిల్లా కలెక్టర్ రాక
ఉమ్మడి నెల్లూరు జిల్లా,సూళ్లూరుపేటలో రేపు ఉదయం ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి తిరుపతి జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన హాజరై ప్రజల సమస్యలపై అర్జీలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.