News February 19, 2025
నెల్లూరు: న్యాయ సేవ సహాయకుల పోస్టులకు నోటిఫికేషన్

జిల్లాలోని గూడూరు, కోవూరు, కావలి, ఉదయగిరి, కోట, ఆత్మకూరు, వెంకటగిరి, S.పేట, N.పేట న్యాయ సేవ అధికార కమిటీల పారా లీగల్ సహాయకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ గీత ఒక ప్రకటన తెలిపారు. 25 లోగా దరఖాస్తులను రిజిస్టర్ పోస్టు ద్వారా జిల్లా కోర్టుకు అందించాలన్నారు. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు, అంగన్వాడీ సేవకులు, లా విద్యార్థులు దరఖస్తు చేసుకోవచ్చన్నారు.
Similar News
News March 12, 2025
నెల్లూరు: ‘ప్లాన్ తయారు చెయ్యడంలో శ్రద్ధ తీసుకోండి’

నియోజకవర్గ స్థాయి స్వర్ణాంధ్ర – 2047 ప్రణాళిక తయారు చేయడంలో నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు అత్యంత శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో స్వర్ణాంధ్ర – 2047 యాక్షన్ ప్లాన్ను నియోజకవర్గ స్థాయిలో తయారు చేసేందుకు వర్క్ షాప్ నిర్వహించారు. GDDPపై వివిధ శాఖల జిల్లా అధికారులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులకు పాల్గొన్నారు.
News March 12, 2025
నెల్లూరు: ANMల కౌన్సెలింగ్ వాయిదా

నెల్లూరు జిల్లాలో సచివాలయం ఏఎన్ఎంలు (గ్రేడ్-3)గా పనిచేస్తున్న 289 మందికి ఎంపీహెచ్ఏ(ఎఫ్)గా ఇటీవల ఉద్యోగోన్నతి కల్పించారు. వీరికి సబ్ సెంటర్ల కేటాయింపునకు సంబంధించి మార్చి 13న నిర్వహించాల్సిన కౌన్సెలింగ్ ప్రక్రియ వాయిదా పడింది. 17న నిర్వహిస్తామని వైద్య ఆరోగ్య శాఖ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ సుచిత్ర తెలిపారు. సీనియారిటీ సమస్యలు ఉత్పన్నం కాకుండా జోన్ పరిధిలోని జిల్లాల్లో ఒకే రోజు నిర్వహిస్తున్నామన్నారు.
News March 12, 2025
డా.N. యువరాజ్కు నెల్లూరు జిల్లా బాధ్యతలు

నెల్లూరు జిల్లా ప్రత్యేకాధికారిగా డా.N.యువరాజ్ IAS నియమితులయ్యారు. ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పర్యవేక్షిస్తారు. పాలన పక్కాగా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలతో కూడిన జోన్కు ప్రత్యేక అధికారిగా మొవ్వ తిరుమల కృష్ణబాబు వ్యవహరిస్తారు.