News November 7, 2024

నెల్లూరు: పదో తరగతి ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

image

పదో తరగతి ఫీజు చెల్లింపునకు గడువును ఈనెల 18 వరకు పొడిగిస్తున్నట్లు నెల్లూరు DEO R.బాలాజీ రావు తెలిపారు. రూ.50 ఫైన్‌తో ఈనెల 25 వరకు, రూ.200 ఫైన్‌తో వచ్చే నెల 03 వరకు, రూ.500 ఫైన్‌తో 10 వరకు చెల్లించవచ్చన్నారు. రెగ్యులర్ విద్యార్థులు రూ.125, సప్లమెంటరీ విద్యార్థులు మూడు సబ్జెక్టులకు రూ.110, ఆపై సబ్జెక్టు రూ.125 చెల్లించాలన్నారు. 

Similar News

News December 4, 2024

నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ

image

నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ జి కృష్ణ కాంత్ నెలవారీ నేర సమీక్షా సమావేశం బుధవారం నిర్వహించారు. జిల్లాలో జరిగిన, పెండింగ్ గ్రేవ్, నాన్ గ్రేవ్, ఆస్తి సంబంధిత నేరాలలో విచారణ గురించి సర్కిల్ వారీగా అధికారులతో సమీక్షించారు. దర్యాప్తు పెండింగ్ ఉన్న గ్రేవ్ కేసులపై సత్వర పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

News December 4, 2024

భార్య హత్య.. ముగ్గురికి ఏడేళ్లు జైలు

image

భార్యను చంపిన ఘటనలో భర్తతోపాటూ మరో ఇద్దరికి ఏడేళ్లు జైళు శిక్ష విధిస్తూ జడ్జి గీత తీర్పు చెప్పారు. కృష్ణా జిల్లాకు చెందిన విజయలక్ష్మికి ముత్తుకూరు గొల్లపూడి విజయకృష్ణతో 2014లో వివాహం అయింది. కట్నం కింద రూ.4లక్షలు, కొంత బంగారం ఇచ్చారు. అదనపు కట్నం కోసం భర్త, ఆడపడుచు, అత్త విజయలక్ష్మిని వేధిస్తూ.. కిరోసిన్ పోసి నిప్పు అంటించడంతో ఆమె చనిపోయింది. ఘటనపై విచారణ చేసిన జడ్జి ముగ్గురికి శిక్ష ఖరారు చేశారు.

News December 4, 2024

ఉన్నతాధికారులతో నెల్లూరు కమిషనర్ భేటీ

image

నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో వివిధ అభివృద్ధి పనులను చేపట్టేందుకు మెట్రో నగరాల అధ్యయనంలో భాగంగా కమిషనర్ సూర్యతేజ హైదరాబాదులోని వివిధ విభాగాల ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. మంగళవారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కూకట్ పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహన్‌ను కమిషనర్ కలుసుకున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థపై చర్చించారు.