News February 28, 2025

నెల్లూరు: పదో తరగతి విద్యార్థులు బస్సుల్లో ప్రయాణం FREE

image

పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాసేందుకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా వెళ్లవచ్చని DEO బాలాజీ రావు తెలిపారు. మనుబోలు మండల కేంద్రంలోని MEO కార్యాలయంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 33,400 మంది విద్యార్థులు మార్చి 15 నుంచి పరీక్షలు రాస్తారన్నారు. వారు ఉచితంగా పరీక్షా కేంద్రానికి బస్సుల్లో వెళ్లవచ్చన్నారు. జిల్లాలో పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

Similar News

News February 28, 2025

పరిశ్రమల ఏర్పాటుకు జాప్యం లేకుండా అనుమతులు: జేసీ

image

జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు జాప్యం లేకుండా అనుమతులను మంజూరు చేయాలని జేసీ కార్తీక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తుల పురోగతి, పిఎంఈజిపి రుణాల మంజూరు, క్లస్టర్‌ డెవలప్‌మెంటు ప్రోగ్రాం  అంశాలను జిల్లా పరిశ్రమల శాఖ జిఎం ప్రసాద్‌ వివరించారు.

News February 28, 2025

నిరుద్యోగుల‌కి ఉపాధి కల్పించేలా చర్యలు: క‌లెక్ట‌ర్

image

రాబోయే ఆర్థిక సంవత్సరంలో మంచి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఎక్కువ మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ స్కిల్ డెవలప్మెంట్ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ప్లాన్ 2025-26 పై సమీక్షా సమావేశం నిర్వహించారు.  

News February 28, 2025

నెల్లూరుకు ప్రముఖ సింగర్స్ రాక

image

కొడవలూరు మండలం గండవరం గ్రామంలో శ్రీ ఉదయ కాళేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఇవాళ రాత్రి గొప్ప సంగీతవిభావరిని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సింగర్స్ సునీత, సమీర భర్వదాజ్, హారికానారాయణ్ లతో జబర్దస్త్ టీం పాల్గొని సందడి చేయనుంది.

error: Content is protected !!