News November 6, 2024
నెల్లూరు: పదో తరగతి విద్యార్ధి అనుమానాస్పద మృతి
నెల్లూరు రూరల్ మండలం ధనలక్ష్మిపురంలోని ఓ ప్రయివేటు స్కూల్‌లో 10వ తరగతి విద్యార్థి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ముత్తుకూరు RR కాలనీకి చెందిన దువ్వూరు ప్రణీత్ అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్కూల్ సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తమ బిడ్డ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ స్కూల్ ఎదుట తల్లిదండ్రులు, బంధువుల ఆందోళన దిగారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 13, 2024
ఏపీలో పౌర విమానయానం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు ఏమిటి: వేమిరెడ్డి
ఏపీలో పౌర విమానయానం అభివృద్ధికి కేంద్రం తీసుకుంటున్న చర్యలు ఏమిటి అని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురువారం పార్లమెంటులో ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపాదించిన విమానాశ్రయాలు పూర్తి చేయడానికి పట్టే సమయాన్ని తెలియజేయాలన్నారు. ఏవియేషన్ ప్రాజెక్టుల ప్రయోజనం కోసం కేటాయించిన నిధులను తెలియజేయాలన్నారు. సహాయ మంత్రి మురళీధర్ సమాధానమిచ్చారు.
News December 12, 2024
సెలవు ఇవ్వకపోతే కఠిన చర్యలు: తిరుపతి జేసీ
భారీ వర్షాల కారణంగా తిరుపతి జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శుభం బన్సల్ శుక్రవారం సెలవు ప్రకటించారు. ఎవరైనా పాఠశాలలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాలతో పాటు వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లె మండలాలకు మాత్రమే సెలవు వర్తిస్తుంది. నెల్లూరు జిల్లాలో సెలవుపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.
News December 12, 2024
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు కీలక పదవి
మాజీ మంత్రి, నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌కు కీలక పదవి దక్కింది. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పీఏసీ మెంబర్‌గా అనిల్ కుమార్ యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.