News September 13, 2024
నెల్లూరు: పరిశ్రమలకు త్వరలో భూమి కేటాయింపు
నెల్లూరులోని ఏపీఐఐసీ కార్యాలయంలో పరిశ్రమల యాజమానులతో సమీక్ష జరిగింది. ఆ సంస్థ జోనల్ మేనేజర్ శేఖర్ రెడ్డి మాట్లాడూతూ.. వెంకటాచలంలోని పారిశ్రామికవాడలో 41 మంది ప్రభుత్వం నుంచి స్థలం తీసుకుని నేటి వరకు పరిశ్రమలు ఏర్పాటు చేయలేదన్నారు. ఆయా స్థలాలను నూతన పరిశ్రమలకు త్వరలో కేటాయిస్తామన్నారు. ప్రస్తుతం అక్కడ నీటి వసతికి బోర్లు వేస్తున్నామని చెప్పారు.
Similar News
News October 4, 2024
తిరుమలకు చేరుకున్న మంత్రి ఆనం
సీఎం చంద్రబాబు ఈరోజు సాయంత్రం శ్రీవారికి కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తిరుమలకు చేరుకున్నారు. ఆయనను టీటీడీ ఈవో శ్యామల రావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి మర్యాదపూర్వకంగా కలిసి ఏర్పాట్లను వివరించారు.
News October 4, 2024
రైల్వే ప్రాజెక్టులపై ఎంపీ వీపీఆర్ చర్చ
విజయవాడలోని సత్యనారాయణపురం ఈటీటీ సెంటర్‌లో దక్షిణ మధ్య రైల్వే అధికారుల సమావేశం శుక్రవారం జరిగింది. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమావేశానికి హాజరై పలు అంశాలను ప్రస్తావించారు. జిల్లాలో దుస్థితిలో ఉన్న రైల్వే స్టేషన్ల అభివృద్ధి, నడికుడి రైల్వే లైను తదితర అంశాలపై చర్చించారు.
News October 4, 2024
పెన్నా నదిలో యువతి మృతి
నెల్లూరు పెన్నా బ్యారేజ్ వద్ద ఓ యువతి మృతదేహం కలకలం రేపింది. ఈరోజు ఉదయం రంగనాయకుల స్వామి గుడి వెనుక నదిలో యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఆమె బుర్కా ధరించి ఉన్నారు. సుమారు 18 నుంచి 20 ఏళ్ల లోపు వయస్సు ఉంటుంది. ఆమె ఆచూకీ తెలిసిన వాళ్లు నెల్లూరు సంతపేట పోలీసులను సంప్రదించాలని కోరారు.