News August 23, 2024
నెల్లూరు: పల్లె ప్రగతికి రూ.34.68 కోట్లు

జిల్లాలోని పంచాయతీలకు రూ.34.68 కోట్ల ఆర్థిక సంఘం నిధులు మంజూరయ్యాయి. 2023-24 సంవత్సరానికి రెండో విడత 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరయ్యాయి. ట్రేడ్ గ్రాంట్గా రూ.20,81,17,976లు, అన్ ట్రేడ్ కింద రూ.13,87,45,162లు.. మొత్తంగా రూ.34,68,63,138 విడుదలయ్యాయి. ఈ నిధుల ద్వారా పంచాయతీల్లో కనీస వసతులు మెరుగుపర్చుకునేందుకు అవకాశం ఉంటుంది.
Similar News
News October 16, 2025
నెల్లూరు: బస్టాండ్ ఓ చోట.. బస్సులు ఆపేది మరోచోట

నిత్యం రద్దీగా ఉండే నెల్లూరు RTC బస్టాండ్ ఎదురుగా ఆటోలు, ప్రైవేట్ బస్సులు ఇష్టానుసారంగా ఆపేస్తున్నారు. ముఖ్యంగా అధికారులు సర్వోదయ కాలేజీని అనుకుని యూనియన్ బ్యాంక్ వద్ద బస్టాండ్ని ఏర్పాటు చేశారు. అక్కడ మాత్రం వాహనాలు నిలపకుండా..కాలేజ్ ఎదురుగా ఆపేస్తున్నారు. ఫలితంగా బస్టాండ్ కట్టినా ప్రయోజనం ఉండడం లేదు. దీంతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవుతున్నాయి. ఇకనైనా ట్రాఫిక్ పోలీసులు తగు చర్యలు తీసుకోవాల్సి ఉంది.
News October 16, 2025
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి: ఎస్పీ

పోలీసులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ డా. అజిత వేజెండ్ల తెలిపారు. గురువారం నగరంలోని చిన్నబజార్ పోలీసు స్టేషన్ను సందర్శించారు. పోలీసు స్టేషన్ పరిసరాలను పరిశీలించి, పచ్చదనం పెంచాలని, పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మహిళలు, బాలికలు తప్పిపోయిన కేసులలో తక్షణమే స్పందించి, ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాలన్నారు. అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదన్నారు.
News October 16, 2025
24 గంటల్లో ఇద్దరు ఆత్మహత్య..!

నెల్లూరు జిల్లాలో గడిచిన 24 గంటల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం మనుబోలు వద్ద ఓ ఇంటర్ విద్యార్థి తనువు చాలించగా, గురువారం నార్త్ రాజుపాలెంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఒకరు పరీక్షలు రాయలేనని, మరొకరు ట్యాబ్ దొంగతనం ఆరోపణలతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.