News August 23, 2024
నెల్లూరు: పల్లె ప్రగతికి రూ.34.68 కోట్లు
జిల్లాలోని పంచాయతీలకు రూ.34.68 కోట్ల ఆర్థిక సంఘం నిధులు మంజూరయ్యాయి. 2023-24 సంవత్సరానికి రెండో విడత 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరయ్యాయి. ట్రేడ్ గ్రాంట్‌గా రూ.20,81,17,976లు, అన్ ట్రేడ్ కింద రూ.13,87,45,162లు.. మొత్తంగా రూ.34,68,63,138 విడుదలయ్యాయి. ఈ నిధుల ద్వారా పంచాయతీల్లో కనీస వసతులు మెరుగుపర్చుకునేందుకు అవకాశం ఉంటుంది.
Similar News
News September 14, 2024
నెల్లూరు: ఈనెల 20న మెగా జాబ్ మేళా
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 20న నెల్లూరు జిల్లాలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణాభివృద్ధి అధికారి సి. విజయవినీల్ కుమార్ తెలిపారు. కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్శిటీ, కోవూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ , ఆత్మకూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలలో ఉదయం 9.30 – 2 గంటల వరకు మేళా జరుగుతుందన్నారు. 10,ఇంటర్, డిగ్రీ, డిప్లమో, ఐటిఐ చేసిన వారు అర్హులు.
News September 14, 2024
సూళ్లూరుపేట: మిస్సైన అమ్మాయి ఆచూకీ లభ్యం
సూళ్లూరుపేట పట్టణంలో శుక్రవారం ట్యూషన్ కోసమని ఇంటి నుంచి వెళ్లి ఆఫ్రీన్(12) మిస్సైన సంగతి తెలిసిందే. అయితే బాలిక ప్రస్తుతం చెన్నై పోలీసుల చెంత సురక్షితంగా ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు. పాప చెన్నైకి వెళ్లి ఓ ఆటో ఎక్కి తనను బీచ్ వద్దకు చేర్చమని ఆటో వ్యక్తికి చెప్పగా అతనికి అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. దీంతో పోలీసులు కుటుంబీకులు సమాచారాన్ని చేరవేసినట్లు తెలిపారు.
News September 14, 2024
నెల్లూరు: రిజిస్ట్రేషన్ శాఖలో ముగ్గురు అధికారులపై వేటు
నెల్లూరు రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయంలో జరిగిన ఆక్రమ రిజిస్ట్రేషన్ పై ఉన్నతాధికారులు కన్నెర్ర చేశారు. కార్పొరేషన్ పరిధిలో నిషేధిత జాబితాలో ఉన్న భూమిని నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేశారు. ఇందులో కీలకంగా వ్యవహరించిన జాఫర్, మిల్కిరోషన్, సింహాద్రిలను సస్పెండ్ చేసినట్లు డీఐజీ కిరణకుమార్ తెలిపారు.