News July 31, 2024

నెల్లూరు: పాఠశాలల మేనేజ్‌మెంట్ కమిటీలకు ఎన్నికలు

image

ప్రభుత్వ పాఠశాలల మేనేజ్‌మెంట్ కమిటీలకు ఎన్నికలు ఆగష్టు8 న జరిగేలా ప్రభుత్వం మంగళవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. గతంలో ఉన్న తల్లిదండ్రుల కమిటీ పేరును కూటమి ప్రభుత్వం మేనేజ్‌మెంట్ కమిటీలుగా మార్పు చేసింది. ఛైర్మన్, వైస్ ఛైర్మన్, సభ్యుల ఎన్నికలకు2న నోటిఫికేషన్ ప్రకటన, 5న ఓటరు జాబితా పై అభ్యంతరాలు స్వీకరణ, తుది జాబితా ప్రకటన, 8న ఎన్నికల నిర్వహణ ఉంటుంది. పాత కమిటీల పదవీకాలం ఈ నెలతో ముగిసింది.

Similar News

News November 3, 2025

నెల్లూరు జైలుకు జోగి రమేష్‌ తరలింపు

image

నకిలీ మద్యం కేసులో అరెస్టు అయిన మాజీ మంత్రి జోగి రమేష్‌, జోగి రామును నెల్లూరు జైలుకు తరలించనున్నారు. జోగి రమేష్‌, ఆయన సోదరుడు జోగి రాముకు ఈ నెల 13 వరకు రిమాండ్‌ విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో వారిని నెల్లూరుకు తీసుకురానున్నారు. ఓ పక్క జోగి రమేష్ అరెస్టు అన్యాయమని, అక్రమమని వైసీపీ నేతలు నిరసన చేపడుతున్నారు.

News November 3, 2025

ఒకే రోజు ఐదుగురు గల్లంతు.. నలుగురి మృతి

image

జిల్లాలో ఆదివారం విషాదం నెలకొంది. ఇందుకూరుపేట(M) మైపాడు బీచ్‌లో ముగ్గురు <<18178820>>ఇంటర్ విద్యార్థులు<<>> మృతి చెందగా, <<18180051>>కావలి(M) <<>>తుమ్మలపెంటలో వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు పడవలో నుంచి కిందపడి మరొకరు మృతి చెందారు. మరోవైపు ఆత్మకూరు పట్టణ సమీపంలోని చెరువులో సాయంత్రం నలిశెట్టి <<18180051>>మహేష్<<>> గల్లంతయ్యాడు. చెరువులో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఇంకా ఆయన ఆచూకీ లభ్యం కాలేదు.

News November 3, 2025

నెల్లూరు: 1,282.63 హెక్టార్లలో పంటకు నష్టం

image

తుపాన్ కారణంగా జిల్లాలో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. 33 శాతం కంటే ఎక్కువగా నష్టం జరిగిన పంట వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. 79,333 హెక్టార్లలో వరి సాగు చెయ్యగా 1282.63 హెక్టార్లలో పంటకు నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వేరుసెనగ 11.4 హెక్టార్లు, మొక్క జొన్న 21.7 హెక్టార్లు, సజ్జ పంటకు 5 హెక్టార్లలో నష్టం వాటిల్లింది.