News July 31, 2024
నెల్లూరు: పాఠశాలల మేనేజ్‌మెంట్ కమిటీలకు ఎన్నికలు

ప్రభుత్వ పాఠశాలల మేనేజ్‌మెంట్ కమిటీలకు ఎన్నికలు ఆగష్టు8 న జరిగేలా ప్రభుత్వం మంగళవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. గతంలో ఉన్న తల్లిదండ్రుల కమిటీ పేరును కూటమి ప్రభుత్వం మేనేజ్‌మెంట్ కమిటీలుగా మార్పు చేసింది. ఛైర్మన్, వైస్ ఛైర్మన్, సభ్యుల ఎన్నికలకు2న నోటిఫికేషన్ ప్రకటన, 5న ఓటరు జాబితా పై అభ్యంతరాలు స్వీకరణ, తుది జాబితా ప్రకటన, 8న ఎన్నికల నిర్వహణ ఉంటుంది. పాత కమిటీల పదవీకాలం ఈ నెలతో ముగిసింది.
Similar News
News January 18, 2026
నెల్లూరు: 9లక్షలకు పైగానే ఫ్రీ బస్ ఎక్కారు..!

సంక్రాంతి కావడంతో ఆర్టీసీ బస్సులన్నీ మహిళలతో కిటకిటలాడాయి. ప్రభుత్వం స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టాక వచ్చిన తొలి సంక్రాంతి కావడంతో మహిళలు సొంతూళ్లకు ఉచితంగా ప్రయాణం చేశారు. ఈనెల 8 నుంచి 16వ వరకు నెల్లూరు జిల్లాలోని 7 డిపోల పరిధిలో 9,55,083 మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు. ఇందుకు గాను ప్రభుత్వంపై రూ.3,89,85,130 భారం పడింది.
News January 18, 2026
వాహనదారులకు నెల్లూరు ఎస్పీ సూచనలు

నెల్లూరు జిల్లాలో పొగ మంచు ఎక్కువైంది. ఈక్రమంలో వాహనదారులకు ఎస్పీ డా.అజిత వేజెండ్ల పలు సూచనలు చేశారు. వాహనదారులు వేగం తగ్గించి, ఫాగ్ లైట్లు ఉపయోగించాలన్నారు. వాహనాల మధ్య దూరం పాటించాలని కోరారు. హజార్డ్ లైట్స్ ఆన్ చేయడంతో పాటు, డి ఫాగర్ ఆన్‌లో ఉంచాలన్నారు. ఈ నియమాలను పాటిస్తూ వాహనదారులు సురక్షితంగా తమ గమ్యాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.
News January 18, 2026
నెల్లూరోళ్లు రూ.23.17 కోట్ల మద్యం తాగేశారు..!

నెల్లూరు జిల్లాలో సంక్రాంతి ఘనంగా జరిగింది. 3రోజులు ప్రజలు ఆహ్లాదంగా గడిపారు. మందుబాబులు మత్తులో మునిగి తేలారు. ఫలితంగా జిల్లాలోని వైన్ షాపులన్నీ కిటకిటలాడాయి. పల్లె, పట్టణమనే తేడా లేకుండా జిల్లా అంతటా మద్యం ఏరులైపారింది. 14 నుంచి 16వ తేదీ రాత్రి వరకు రూ.23.17 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అదనంగా రూ. 2.06. కోట్ల మేర వ్యాపారం జరిగింది.


