News April 30, 2024
నెల్లూరు పార్లమెంట్ బరిలో 14 మంది

నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. సోమవారం సాయంత్రం నామినేషన్ ఉపసంహరణ అనంతరం అధికారిక జాబితా విడుదల చేశారు. మొత్తం 15 నామినేషన్‌లో ఉండగా వారిలో ఒకరు సోమవారం ఉపసంహరించుకున్నారు. దీంతో 14 మంది బరిలో నిలిచారు. ప్రధానంగా టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి, వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి మధ్య పోటీ నెలకొని ఉంది.
Similar News
News November 28, 2025
నెల్లూరు: విలీనం.. ఆదాయానికి గండే..!

నెల్లూరు జిల్లాలో మైకా, క్వార్ట్జ్, గ్రావెల్ వంటి ఖనిజ సంపద, అలాగే షార్, నేలపట్టు, వెంకటగిరి చేనేత వస్త్రాలు వంటి పర్యాటక ప్రాంతాలు తిరుపతి జిల్లాలో కలిసిపోయాయి. దీని వలన నెల్లూరు జిల్లాకు ఖనిజాలు, పర్యాటకం రూపంలో వచ్చే ఆదాయ వనరులు తరలిపోయాయి. ఇక నెల్లూరుకు కృష్ణపట్నం పోర్టు, రొట్టెల పండుగ మాత్రమే మిగలడం జిల్లా మనుగడకే సవాలుగా మారుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది.
News November 28, 2025
నెల్లూరు: ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన జిల్లా.. ముక్క చెక్కలు..!

1956లో పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగంతో ఉమ్మడి మద్రాసు నుంచి తెలుగు మాట్లాడే వారందరికీ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆయన పేరు మీద పెట్టిన నెల్లూరు (సింహపురి) జిల్లాను ముక్కలు చెక్కలు చేయడాన్ని జిల్లా వాసులు ప్రశ్నిస్తున్నారు. చరిత్ర కలిగిన నెల్లూరును విడగొట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. అప్పటి త్యాగఫలం నేడు చిన్నభిన్నం అవుతోందా అనే ప్రశ్న తలెత్తుతోంది.
News November 28, 2025
నెల్లూరులో గూడూరును కలవనీయకుండా అందుకే అడ్డుకున్నారా.?

గూడూరును నెల్లూరులో కలవనీయకుండా ఓ బడా పారిశ్రామికవేత చక్రం తిప్పినట్లు సమాచారం. 3 నియోజకవర్గాల్లో క్వార్ట్జ్, అభ్రకం, మైకా వంటి ఖనిజాలు పుష్కలం. ఇవి నెల్లూరుకు వెళితే ఖనిజాలపై ‘రెడ్ల’ ఆధిపత్యం పెరుగుతుందని దీనిని అడ్డుకోవడానికి ఇలా చేసినట్లు తెలుస్తోంది. ఆయన ఎన్నికల్లోనూ ఆర్థికంగా ప్రభావం చూపించారట. తిరుపతి గ్రేటర్ పరిధి పెరుగుతన్న క్రమంలో గూడూరును సాంకేతికంగా నెల్లూరులో కలపలేదన్న వాదన కూడా ఉంది.


