News September 9, 2024
నెల్లూరు: పునాస మామిడికి గిరాకీ ఎక్కువే
నెల్లూరు జిల్లాలో పునాస మామిడికి గిరాకీ పెరిగినట్లు వ్యాపారస్థులు చెబుతున్నారు. మేలు రకం కాయలను టన్ను రూ. 60వేల నుంచిరూ.70వేలు, మసర,మంగున్న కాయలు రూ.40 – 50 వేల వరకు పలుకుతున్నాయన్నారు. అయితే ఈ రకం కాయలకు కేరళలో డిమాండ్ ఎక్కువ. అక్కడ సెప్టెంబరులో జరిగే ఓనం పండుగకు ఇవి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. ప్రతిరోజూ మన నెల్లూరు నుంచి 50-60 టన్నులు ఎగుమతి అవుతున్నాయని అంటున్నారు. ఈసారి ధరలు పెరిగాయన్నారు.
Similar News
News October 4, 2024
సరఫరాకు ఇసుక సిద్ధంగా ఉంది: కలెక్టర్
నెల్లూరు కలెక్టర్ చాంబర్లో గురువారం జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రజల అవసరాలకు సరిపడా ఇసుక సిద్ధంగా ఉందని, ఆన్లైన్ పోర్టల్ ద్వారా బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇసుకను సకాలంలో అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. బుకింగ్స్ పెరిగే కొద్దీ ఇసుక నిల్వలు పెంచేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
News October 3, 2024
నెల్లూరు: కారు బోల్తా.. ఒకరు మృతి
కారు బోల్తాపడిన సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడిన సంఘటన వింజమూరు మండలం బొమ్మరాజుచెరువువద్ద గురువారం చోటుచేసుకుంది. కావలి నుంచి కడపకు వెళ్తున్న కారు బొమ్మరాజుచెరువు వద్ద కంకరగుట్ట ఎక్కి అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో కడపకు చెందిన ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో కారు నుజ్జునజ్జయింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News October 3, 2024
చండీ అలంకారంలో శ్రీరాజరాజేశ్వరి
నెల్లూరులోని శ్రీరాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో మొదటి రోజైన గురువారం అమ్మవారు శ్రీచండీ అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.