News July 20, 2024
నెల్లూరు: పెట్రోల్ బంకులపై వాహనదారుల ఆగ్రహం
జిల్లాలోని పలు పెట్రోల్ బంకులలో గాలి మిషన్లు పని చేయడం లేదని వాహనదారులు మండిపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 189 పెట్రోల్ బంకులు ఉండగా ప్రతి రోజూ 7 లక్షల లీటర్ల డీజిల్, 4 లక్షల లీటర్ల పెట్రోల్ వినియోగం జరుగుతోంది. నిబంధనల మేరకు ప్రతి బంకులో గాలి మిషన్ ఏర్పాటు చేయాలి. కొన్ని చోట్ల గాలి మిషన్లు లేవని, మరికొన్ని చోట్ల పని చేయడం లేదన్నారు. దీంతో ఇబ్బందులు పడుతున్నట్లు వాహన దారులు వాపోయారు.
Similar News
News October 4, 2024
వెంకటగిరి పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట
ఓ ప్రేమజంట పోలీసులను ఆశ్రయించిన ఘటన ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరిగింది. వెంకటగిరి పట్టణంలోని బొప్పాపురానికి చెందిన నర్సింహులకు సైదాపురం మండలం దేవర వేమూరుకు చెందిన శైలజ ఇన్‌స్టాగ్రాంలో పరిచయమైంది. కొద్ది రోజులకు ప్రేమించుకున్నారు. ఇంట్లో వారు ఒప్పుకోకపోవడంతో వెంకటగిరి పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చారు. ఎస్ఐ సుబ్బారావు ఇరువురి కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్లను ఇళ్లకు పంపించారు.
News October 4, 2024
NLR: బాలికపై లైంగిక దాడికి యత్నం
బాలికపై యువకుడు లైంగికదాడికి యత్నించిన ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. వెంకటాచలం మండలంలో ఓ గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలిక టిఫిన్ తెచ్చుకునేందుకు బయల్దేరింది. అదే గ్రామానికి చెందిన యువకుడు ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News October 4, 2024
సరఫరాకు ఇసుక సిద్ధంగా ఉంది: కలెక్టర్
నెల్లూరు కలెక్టర్ చాంబర్లో గురువారం జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రజల అవసరాలకు సరిపడా ఇసుక సిద్ధంగా ఉందని, ఆన్లైన్ పోర్టల్ ద్వారా బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇసుకను సకాలంలో అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. బుకింగ్స్ పెరిగే కొద్దీ ఇసుక నిల్వలు పెంచేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.