News June 24, 2024
నెల్లూరు: పెద్దపులి జాడ రేపు తెలియనుందా ?

మర్రిపాడు: కదిరినాయుడుపల్లి అటవీ ప్రాంతంలో పెద్దపులి జాడ మంగళవారం తెలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇటీవల ఒక కారుపై పెద్దపులి దాడి చేసినట్లు వచ్చిన వార్త ఆధారంగా అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో పెద్దపులి జాడ తెలుసుకునేందుకు 35 కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. నిరంతర పర్యవేక్షణ కోసం ఉదయగిరి, కావలి, నెల్లూరు, ఆత్మకూరు, రాపూరు అధికారులు విధులు నిర్వహిస్తున్నారు.
Similar News
News January 10, 2026
ఫ్లెమింగో ఫెస్టివల్.. నేలపట్టును చూసేయండి!

దొరవారిసత్రం(M)లోని నేలపట్టు పక్షుల అభయారణ్యం సూమారు 458.92 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. వలస పక్షులు ఏటా అక్టోబర్ నుంచి మార్చి వరకు ఇక్కడే గుడ్లను పొదిగి పిల్లలు పెద్దవి అయ్యాక స్వస్థలాలకు వెళ్లిపోతాయి. ఈ పక్షులు పులికాట్ సరస్సులో వేట ముగించుకుని సాయంత్రం నేలపట్టు వద్ద కలపచెట్లపై సేదతీరుతాయి. వీటిని చూసేందుకు బైనాక్యులర్లను ఉంచారు. నేలపట్టు గురించి వీడియో ప్రదర్శన, స్నేక్ షో ఏర్పాటు చేశారు.
News January 10, 2026
కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న హౌస్ అరెస్ట్

కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. శుక్రవారం నెల్లూరులోని ఆయన నివాసం వద్ద పోలీసులు ఆయనకు నోటీసులు అందజేశారు. సోమశిల జలాశయం సందర్శనకు వెళుతున్న సందర్భంగా ఆయనకు నోటీసులు అందించినట్లు సమాచారం. ఈ నోటీసులు అందజేయడంపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు.
News January 10, 2026
సూళ్లూరుపేట: పక్షుల పండుగ.. నేటి కార్యక్రమాలు

ఉ. 9 గంటలు: S.పేట హోలీక్రాస్ సర్కిల్ నుంచి కళాశాల మైదానం వరకు శోభాయాత్ర
9.30- 12 : పక్షుల పండుగ, స్టాళ్ల ప్రారంభం
సా.5 : సాంస్కృతిక కార్యక్రమాలు, ఫ్లెమింగోపై పాటకు డాన్స్, పులికాట్ సరస్సు, నేలపట్టు పక్షుల రక్షితకేంద్రం, పులికాట్ సరస్సులో వేట విన్యాసాలపై వీడియో ప్రదర్శన, లైటింగ్ ల్యాంప్
సా.6.30కి ఫ్లెమింగో ఫెస్టివల్ 2026 ఆవిష్కరణ
సా.7గంటలకు అతిథుల ప్రసంగాలు
సా.7.30-10 గంటల వరకు పాటకచ్చేరి, డాన్స్


