News November 30, 2024

నెల్లూరు: పెన్నానదికి హై అలర్ట్ !

image

పెన్నానదికి భారీగా వరద పోటెత్తే ప్రమాదం ఉందని కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావంతో ఆదివారం రాత్రి వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో పెన్నానదికి వరదలు సంభవించవచ్చని జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. పెన్నానది పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించింది. కృష్ణపట్నం పోర్టుకు 6వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

Similar News

News December 26, 2024

వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామికి పూజలు

image

రాపూరు మండలంలోని పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో గురువారం స్వాతి నక్షత్రం సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. స్వామివారికి అభిషేకం, నరసింహ యాగం తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి. అనంతరం స్వామి అమ్మవార్లకు కల్యాణ కార్యక్రమం వేద పండితుల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

News December 26, 2024

REWIND: నెల్లూరులో జలప్రళయానికి 20 మంది బలి

image

సునామీ ఈ పేరు వింటేనే నెల్లూరు జిల్లాలోని తీర ప్రాంత గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. సరిగ్గా20 ఏళ్ల క్రితం 2004 డిసెంబర్ 26న నెల్లూరు జిల్లాలో సునామీ పంజా విసిరింది. ఈ ధాటికి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 20మంది మృతి చెందారు. కళ్లెదుటే కుటుంబ సభ్యులను పోగుట్టుకున్న పరిస్థితులను ఇప్పుడు తలచుకున్నా ఆ భయం అలానే ఉందని నెల్లూరు వాసులు పేర్కొంటున్నారు.

News December 26, 2024

నెల్లూరు జిల్లాలో చలిగాలులతో వణుకుతున్న ప్రజలు

image

అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లా ప్రజలు చలిగాలులతో వణుకుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ముసురు పట్టి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తుండడంతో గత రెండు రోజులుగా చలిగాలుల తీవ్రత ఎక్కువైంది. దీంతో వృద్ధులు పిల్లలతో పాటు సాధారణ ప్రజలు కూడా చలికి గజగజ వణికి పోతున్నారు.