News November 30, 2024
నెల్లూరు: పెన్నానదికి హై అలర్ట్ !

పెన్నానదికి భారీగా వరద పోటెత్తే ప్రమాదం ఉందని కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావంతో ఆదివారం రాత్రి వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో పెన్నానదికి వరదలు సంభవించవచ్చని జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. పెన్నానది పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించింది. కృష్ణపట్నం పోర్టుకు 6వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
Similar News
News January 23, 2026
నెల్లూరు: జవాన్‌పై దాడి.. ఇరు వర్గాలపై కేసు

BSF జవాన్ జోడు వెంకటప్రసాద్‌పై దాడి కేసులో పరస్పర ఫిర్యాదులు అందడంతో ఇరు వర్గాలపై కేసు నమోదు చేసినట్లు సీతారాంపురం ఎస్సై శివకృష్ణారెడ్డి తెలిపారు. ఒడిశాలో పనిచేస్తున్న ఆయన కుటుంబంతో కలిసి సంక్రాంతికి స్వగ్రామానికి వచ్చారు. ఈ క్రమంలో పాతకక్షలను దృష్టిలో ఉంచుకున్న స్థానికులు బంధుగుల ప్రసాద్, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు గ్రామ రోడ్డు సెంటర్లో ఉన్న జవాన్‌పై మూకుమ్మడిగా దాడి చేసి గాయపర్చారు.
News January 23, 2026
నేటి నుంచి తిరుపతిలో టోకెన్ల్ బంద్

తిరుమలలో ఈనెల 25న రథసప్తమి వేడుకలు చేయనున్నారు. ఈక్రమంలో మూడురోజులు సర్వదర్శన టోకెన్ల జారీని టీటీడీ నిలిపివేయనుంది. తిరుపతిలోని మూడు కేంద్రాల్లో ఈనెల 23, 24, 25వ తేదీల్లో ఈ టికెట్లు జారీ చేయరు. తిరిగి 26వ తేదీన మరుసటి రోజు దర్శనానికి సంబంధించి టోకెన్లను ఇస్తారు. ఈ మేరకు ఆయా టోకెన్ల జారీ కేంద్రాల వద్ద బోర్డులు ఏర్పాటు చేశారు.
News January 22, 2026
నెల్లూరు: ఆక్వా రైతులకు లైసెన్స్ తప్పనిసరి

నెల్లూరు జిల్లాలో ఆక్వా రైతుకు కరెంట్ సబ్సిడీ లబ్ధికి అనుమతులు తప్పనిసరి అని మత్స్యశాఖ అధికారిని శాంతి ఓ ప్రకటనలో తెలిపారు. APSADA & CAA చట్ట నిబంధనల మేరకు ఆక్వా సాగు చేయు (మంచి నీటి & ఉప్పు నీటి వనరులలో) ప్రతి రైతు కరెంటు సబ్సిడీని పొందుటకు తప్పనిసరిగా మత్స్యశాఖ ద్వారా లైసెన్సు పొందాలన్నారు. అనుమతి పొందని వారు ఈనెల 31వ తేదీ లోగా సచివాలయం ద్వారా లైసెన్సు దరఖాస్తు చేసుకోవాలన్నారు.


