News March 25, 2026

నెల్లూరు: పేరుకే నగర పంచాయతీలు..!

image

బుచ్చి, అల్లూరుకు జనాభాను చూసి నగర పంచాయతీల హోదా ఇచ్చారు. కానీ ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి నామమాత్రమే. ప్రజల నుంచి ఆస్తి, కొళాయి పన్నులను వసూలు చేస్తున్నా నగర ప్రాంతానికి ఉండాల్సిన హంగులు లేవు. కనీసం డివైడర్ల రూపు రేఖలు మారడం లేదు. ఎక్కడ చూసినా మురుగు, వ్యర్థాలతో నిండిపోతున్నాయి. బుచ్చిలో 42 వేలు, అల్లూరులో 35 వేలకు పైగా జనాభా ఉన్నా వసతులు లేవు. పాలకులు వీటి అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సి ఉంది.

Similar News

News April 20, 2026

బసవేశ్వరుడికి నెల్లూరు కలెక్టర్ నివాళులు

image

నెల్లూరు కలెక్టరేట్‌లో మహాత్మా బసవేశ్వర జయంతి సోమవారం జరిగింది. కలెక్టర్ హిమాన్షు శుక్లా, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి విజయకుమార్ తదితరులు బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. బసవేశ్వర గొప్ప సామాజిక సంస్కర్త, తత్వవేత్త, కవి అన్నారు. కుల, లింగ వివక్షతను వ్యతిరేకిస్తూ సమసమాజ నిర్మాణం కోసం కృషి చేశారని కొనియాడారు.

News April 20, 2026

ఫలించిన నెల్లూరు కలెక్టర్ ప్రయత్నం

image

నెల్లూరు ఇన్‌ఛార్జ్ DPO వసుమతికి ఇటీవలే సీఈవోగా ప్రమోషన్ లభించింది. ఆ తర్వాత ఆమెను తిరుపతి జిల్లాకు బదిలీ చేశారు. నెల్లూరు జిల్లాలోనే ఆమెకు బాధ్యతలు ఇవ్వాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆ శాఖ రాష్ట్ర కమిషనర్‌కు లేఖ రాశారు. దీనికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా ఆమెను నెల్లూరు జిల్లా స్వర్ణ గ్రామ/వార్డు అధికారిణిగా నియమించారు.

News April 20, 2026

BREAKING: నెల్లూరులో ఘోర ప్రమాదం

image

నెల్లూరు సిటీలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ముత్తుకూరు రోడ్డు వడ్డిపాలెం సమీపంలో స్కూటీని ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు చక్రాల కింద పడటంతో స్పాట్‌లోనే చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. స్కూటీ నంబర్ AP40KK6649 ఆధారంగా మృతుల వివరాలు సేకరిస్తున్నారు.