News November 26, 2024

నెల్లూరు: పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట

image

ప్రేమ వివాహం చేసుకుని రక్షణ కల్పించాలని నూతన వధూవరులు ఆదివారం ఉదయగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్‌ను ఆశ్రయించారు. దుత్తలూరు మండలం నాయుడుపల్లి పంచాయతీలోని ఎస్సీ కాలనీకి చెందిన నల్లి పోగు షాలినీ(19), అదే ఎస్సీ కాలనీకి చెందిన మున్నంగి జాషువా (26) ఈ ఇద్దరు నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. ఇద్దరి కులాలు ఒకటే కావడంతో పెద్దలు అంగీకరించరని తెలిసి వివాహం చేసుకున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 21, 2025

జర్నలిస్ట్‌లు అక్రిడేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలి : DIPRO

image

2026 – 2027 సంవత్సరానికి గాను అక్రిడేషన్ ప్రక్రియ ప్రారంభమైనట్లు DIPRO, I&PR కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపారు. https://mediarelations.ap.gov.in/media/#/home/index లింకు ద్వారా వెంటనే రిజిస్టర్ చేసుకోవాలన్నారు. రిపోర్టర్ తమ పేరు, హోదా, మెయిల్ అడ్రస్, ఆధార్ నెంబరు, పాస్వర్డ్, ఫోన్ నెంబర్ నమోదు చేసి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి రిజిస్టర్ కావాలన్నారు. పూర్తి వివరాలతో దరఖాస్తును ఆన్లైన్ ద్వారా పంపించాలన్నారు.

News November 21, 2025

నెల్లూరు జిల్లాలో అధ్వాన స్థితిలో PHCలు

image

నెల్లూరు జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సేవలు దయనీయంగా ఉన్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. PHCల పనితీరు ఆధారంగా ప్రభుత్వం ప్రతి నెల గ్రేడ్ కేటాయిస్తుంది. అక్టోబర్ నెలలో A. గ్రేడ్ సాధించిన PHC జిల్లాలో ఒక్కటి కూడా లేదు. 8 PHCలకు B. గ్రేడ్, 36 PHCలకు C. గ్రేడ్, 8 PHCలకు D. గ్రేడ్ వచ్చింది. A. గ్రేడ్ రావడం గగనమైంది. PHCల పనితీరు మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

News November 21, 2025

నెల్లూరులో చేపల సాగుకు ప్రాధాన్యత

image

రొయ్యలకంటే చేపల సాగుకే నెల్లూరులో ప్రాధాన్యత పెరుగుతోంది. తక్కువ ఖర్చులు, స్థిరమైన చరల కారణంగా చేపల పెంపకం ఏటా విస్తరిస్తోంది. జిల్లాలో 5 వేల ఎకరాల్లో గెండి, బొచ్చ, మోసు, రూప్‌చంద్ చేపలు ప్రధానంగా సాగు అవుతున్నాయి. సంవత్సరానికి సగటుగా 1.7 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తోంది. ఇందులో గెండి 10%, బొచ్చ 35%, మోసు 3% ఉత్పత్తి. చేపలను తమిళనాడు, కర్ణాటక, కేరళ, ప.బెంగాల్‌కి ఎగుమతి చేస్తున్నారు.