News August 22, 2024
నెల్లూరు; పోలీస్ స్టేషన్ లకు బదిలీ అయిన ఎస్ఐలు వీరే..

జిల్లాలోని ఎస్ఐలు పోలీసు స్టేషన్ లకు బదిలీ అయ్యారు. కె. కిషోర్ బాబు కండలేరు నుంచి అల్లూరుకు, డిసీఆర్బీ నెల్లూరు నుంచి ఎన్. కాంతి కుమార్ సైదాపురానికి, సైదాపురం నుంచి డి.ఎస్.కుమార్, కొండాపురం నుంచి మహేంద్రలు డిసీఆర్బీ నెల్లూరుకు, విఆర్ నెల్లూరు నుంచి కె.అంకమ్మ ఉలవపాడుకు, ఎస్. కె. జిలానీ ఆత్మకూరుకు, నెల్లూరు చిన్న బజార్ నుంచి జలదంకి ఎస్.డి. లతీఫ్ ఉన్నీసా, నెల్లూరు రూరల్ నుంచి కె.స్వప్న నవాబ్ పేటకు.
Similar News
News October 16, 2025
24 గంటల్లో ఇద్దరు ఆత్మహత్య..!

నెల్లూరు జిల్లాలో గడిచిన 24 గంటల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం మనుబోలు వద్ద ఓ ఇంటర్ విద్యార్థి తనువు చాలించగా, గురువారం నార్త్ రాజుపాలెంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఒకరు పరీక్షలు రాయలేనని, మరొకరు ట్యాబ్ దొంగతనం ఆరోపణలతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
News October 16, 2025
నెల్లూరు చేపల పులుసా.. మజాకా.!

నెల్లూరు చేపల పులుసుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజా చేపలతో చేసే ఈ పులుసును ఎవరైనా లొట్టలేసుకుంటూ తినాల్సిందే. మన నెల్లూరు చేపల పులుసును ఇతర దేశాలకు సైతం సరఫరా చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. నెల్లూరు చేపల కూరలతో మెట్రోపాలిటన్ సిటీలో కూడా వ్యాపారాలు కొనసాగుతున్నాయి. టేస్ట్తోపాటూ దీనిలోని సహజ పోషక లక్షణాలు హృదయ రోగులకు ఎంతో మేలు చేస్తాయి.
# నేడు ప్రపంచ ఆహార దినోత్సవం.
News October 16, 2025
కూతురిపై అత్యాచారం.. తండ్రికి జీవిత ఖైదు

కూతురిపై తాగిన మైకంలో అత్యాచారానికి పాల్పడిన ఓ తండ్రికి కోర్టు జీవిత ఖైదు విధించింది. జలదంకి మండలానికి చెందిన బాలరాజు 2019 జూన్ 24న ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూతురిపై అత్యాచారం చేశారు. ఆమెకు గర్భం రావడంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో కేసు నమోదైంది. నేరం రుజువు కావడంతో అతడికి జీవిత ఖైదుతో పాటు రూ.50 వేలు జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.