News January 7, 2025
నెల్లూరు ప్రజలు భయపడకండి: DMHO

బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్న నెల్లూరు వాసులు సంక్రాంతికి తమ స్వగ్రామాలకు రానున్నారు. అక్కడ HMPV కేసు నమోదు కావడంతో ఇక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఈ కేసులు లేవని.. కరోనా లాగా ప్రభావం కూడా ఉండదని నెల్లూరు DMHO వి.సుజాత చెప్పారు. జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, శ్వాస సమస్యలుంటే సొంత వైద్యం చేసుకోకుండా డాక్టర్లను సంప్రదించాలని కోరారు. వారం రోజుల్లో సమస్య తగ్గిపోతుందన్నారు.
Similar News
News December 29, 2025
నెల్లూరు జిల్లాలో గూడూరు.. ట్విస్ట్ ఇదే.!

గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి నుంచి మళ్లీ నెల్లూరు జిల్లాలో కలుపుతూ క్యాబినేట్ నిర్ణయం తీసుకుంది. అయితే గూడూరు, చిల్లకూరు, కోట మండలాలను మాత్రమే నెల్లూరులో కలిపారు. చిట్టమూరు, వాకాడు మండలాలు తిరుపతి జిల్లాలోనే కొనసాగనున్నాయి. వాకాడులో దుగరాజపట్నం పోర్ట్ కారణంగానే ఆ మండలాన్ని తిరుపతిలో కొనసాగించనున్నారు. చిట్టమూరు సైతం తిరుపతికి దగ్గరగా ఉంటుంది.
News December 29, 2025
OFFICIAL: నెల్లూరులోకి గూడూరు.!

గూడూరు నియోజకవర్గాన్ని తిరిగి నెల్లూరు జిల్లాలో కలపాలని అధికారికంగా నిర్ణయించారు. ఈ మేరకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కొత్త మార్పులు జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. మరోవైపు వెంకటగిరి నియోజకవర్గంలోని రాపూరు, సైదాపురం, కలువాయి మండలాలను సైతం నెల్లూరు జిల్లాలోకి తీసుకురానున్నారు.
News December 29, 2025
నెల్లూరు: గ్రీటింగ్ కార్డులు మాయం..!

స్మార్ట్ఫోన్ల యుగంలో భావాలను వ్యక్తపరిచే పద్ధతులే మారిపోయాయి. ఒకప్పుడు పండగలు, పర్వదినాలు వచ్చాయంటే చేతిలో గ్రీటింగ్ కార్డు తప్పనిసరిగా ఉండేది. కాలక్రమంలో వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలు శుభాకాంక్షల మార్పిడిని పూర్తిగా డిజిటల్‌గా మార్చేశాయి. ఒక్క క్లిక్‌తోనే సందేశం చేరుతుండటంతో గ్రీటింగ్ కార్డుల అవసరం తగ్గింది.


