News November 4, 2024
నెల్లూరు ప్రజలు సద్వినియోగం చేసుకోండి: కమిషనర్

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలకు పరిష్కారం పొందాలని కమిషనర్ సూర్య తేజ ఆకాంక్షించారు. నేడు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రజలు నేరుగా తమ సమస్యలను అర్జీల రూపంలో తమకు చెప్పొచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News November 13, 2025
వారికి రూ.90 కోట్ల మంజూరు: అబ్దుల్ అజీజ్

నెల్లూరు: ఇమామ్, మౌజన్ల గౌరవ వేతనాల కోసం రూ.90 కోట్లు మంజూరు చేసినట్లు ఏపీ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉందని మరోసారి నిరూపించిందన్నారు. చంద్రబాబు దూరదృష్టి, సమానత్వ నిబద్ధతతోనే ముస్లింల అభివృద్ధి జరుగుతుందన్నారు.
News November 12, 2025
రేపే నెల్లూరుకు ఫుడ్ కమిషన్ సభ్యుడి రాక

రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు బి.కాంతారావు నెల్లూరు జిల్లాలో ఈనెల 13, 14న పర్యటించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ హిమాన్షు శుక్లా బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పీడీఎస్ షాప్స్, ఐసీడీఎస్, మధ్యాహ్న భోజన పథకం అమలు, అంగన్వాడీ కేంద్రాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాలను తనిఖీ చేస్తారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖపై సమీక్ష చేస్తారు.
News November 12, 2025
నెల్లూరు: ఆక్వా రైతులకు గమనిక

ఆక్వా రైతులందరికీ విద్యుత్తు బిల్లుల్లో రాయితీ ఇస్తామని నెల్లూరు RDO అనూష ప్రకటించారు. రాష్ట్ర ఆక్వా కల్చర్ అభివృద్ధి అథారిటీ చట్టం-2020 ద్వారా అనుమతులు పొందిన వాళ్లే అర్హులన్నారు. రొయ్యలు, చేపల చెరువుల రైతులు సచివాలయంలో రూ.1000 కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఆధార్ కార్డు, పాస్ బుక్, ఆటో క్యాడ్ మ్యాప్, ప్రాజెక్ట్ రిపోర్ట్, మీటర్ నంబర్, వాల్టా చట్టం అఫిడవిట్ పేపర్లు అవసరమని చెప్పారు.


