News June 16, 2024
నెల్లూరు ప్రజల ఆశలన్నీ నారాయణపైనే..!

ఉమ్మడి జిల్లాలో గూడూరు, వెంకటగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేట, కావలి, ఆత్మకూరు మున్సిపాల్టీలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో తాగునీటి సమస్య వేధిస్తోంది. మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు నిలిచిపోయాయి. మన జిల్లా వాసి నారాయణకే మున్సిపల్, పట్టణాభివృద్ధి మంత్రి పదవి రావడంతో సమస్యలు తీరుతాయని ప్రజలు భావిస్తున్నారు. మరి మీ పట్టణంలో సమస్యలు ఏంటో కామెంట్ చేయండి.
Similar News
News November 19, 2025
కావలి: ప్రేమపేరుతో మోసం.. యువతి ఆత్మహత్యాయత్నం

ప్రేమపేరుతో యువకుడు మోసం చేయడంతో యువతి ఆత్మహత్యాయత్ననికి పాల్పడిన ఘటన కావలిలో చోటుచేసుకుంది. విష్ణాలయం వీధికి చెందిన యువకుడు ఓ యువతిని ఐదు నెలలుగా ప్రేమిస్తున్నానని నమ్మించాడు. పెళ్లి చేసుకోమంటే కులం పేరుతో దూషించి నిరాకరించాడు. దీంతో మనస్తాపానికి చెందిన యువతి ఫినాయిల్ తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 19, 2025
నేడు నెల్లూరు జిల్లాలో 1.95 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు.!

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రైతులు ఆశగా ఎదురుచూస్తున్న అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ రెండో విడత నిధులు బుధవారం వారి ఖాతాలకు జమ కాబోతున్నాయి. అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం.. జిల్లాలో 1.95 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.130.20 కోట్లు జమ అవుతాయన్నారు. నియోజకవర్గాలవారిగా ఎమ్మెల్యేలు, కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
News November 18, 2025
నెల్లూరు: సంగం వద్ద RTC బస్సుకు తప్పిన ప్రమాదం

నెల్లూరు జిల్లా సంగం వద్ద RTC బస్సుకు మంగళవారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. షాట్ సర్క్యూట్‌తో బస్సుకింద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతంలో విధుల్లో ఉన్న కానిస్టేబుల్ మంటలు గమనించి బైక్‌తో బస్సును చేజ్ చేసి ఆపాడు. అనంతరం బస్సులోని వారందరినీ డ్రైవర్ కిందికి దింపడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 45మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.


