News September 15, 2024
నెల్లూరు :ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు
నెల్లూరు జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో జరగనున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించట్లేదని కలెక్టర్ ఆనంద్ ఒక ప్రకటన విడుదల చేశారు. మీలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా సోమవారం అర్జీలు స్వీకరించలేమని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రజలు, అర్జీదారులు గమనించవలసినదిగా ఆయన కోరారు. వచ్చే సోమవారం యధావిధిగా కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు.
Similar News
News October 6, 2024
నెల్లూరు: దసరాకు ఊర్లకు వెళ్లేవారికి హెచ్చరిక
నెల్లూరు జిల్లాలో దసరా పండుగ రోజుల్లో ఇళ్లకు తాళం వేసి ఊళ్లకు వెళ్లేవారు దొంగతనాలు జరగకుండా లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టంను వినియోగించుకోవాలని ఎస్పీ జి క్రిష్ణ కాంత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. LHMS యాప్, 9440796383, 9392903413 నంబర్ లకు, స్థానిక పోలీసులను సంప్రదించి LHMS సేవలు ఉచితంగా పొందవచ్చన్నారు. డబ్బు, విలువైన ఆభరణాలు ఇంట్లో ఉంచి వెళ్లకూడదని బ్యాంకులో ఉంచుకోవాలన్నారు.
News October 6, 2024
మోడల్ సిటీగా నెల్లూరు : నారాయణ
నెల్లూరును మోడల్ సిటీగా తీర్చిదిద్దేందుకు అందరి సమన్వయంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నట్లు మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నగరంలోని క్యాంప్ కార్యాలయంలో టీడీపీ డివిజన్ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. డివిజన్ల పరిధిలోని ప్రతి సమస్యను తన దృష్టికి తేవాలని సూచించారు. నాయకులందరూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని పిలుపునిచ్చారు.
News October 6, 2024
వింజమూరులో భారీ వర్షం
గత కొద్ది రోజులుగా వింజమూరు మండలం వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయి భారీ వర్షం కురిసింది. రోడ్లు జలమయం అయ్యాయి. వర్షం రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు, వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.