News February 24, 2025
నెల్లూరు: ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-2 మెయిన్స్

నెల్లూరు జిల్లాలో ఆదివారం జరిగిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ఎగ్జామ్స్ కో-ఆర్డినేటింగ్ ఆఫీసర్ తిరుమణి శ్రీపూజ తెలిపారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని మొత్తం 7 కేంద్రాలలో జరిగిన పరీక్షలకు 86.4% మంది అభ్యర్థులు హాజరయ్యారన్నారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 4102 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 3546 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 556 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు.
Similar News
News February 24, 2025
నెల్లూరు: భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య

భార్య పుట్టింటికి వెళ్లిందన్న మనస్తాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన నెల్లూరు నగరం కపాడిపాలెంలో చోటుచేసుకుంది. కపాడిపాలెంకు చెందిన శ్రావణ్ కారు డ్రైవర్‌గా భార్య సుమాంజలి నర్స్‌గా పని చేస్తున్నారు. వారికి ఇద్దరు సంతానం. ఇటీవల వారి మధ్య చిన్నపాటి గొడవ జరగ్గా భార్య పుట్టింటికి వెళ్లింది. మనస్తాప చెందిన శ్రావణ్ ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
News February 23, 2025
నెల్లూరు నుంచి గ్రూప్-2కు తక్కువగా హాజరైన అభ్యర్ధులు.!

రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలకు 13 జిల్లాల్లో 92 శాతం అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. అయితే అత్యధికంగా విశాఖ జిల్లా వారు హాజరయ్యారు. నెల్లూరు జిల్లా నుంచి అత్యల్పంగా అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. నెల్లూరు జిల్లాలో 3546 మంది పరీక్షలకు హాజరై 86.4గా నమోదైన సంగతి తెలిసిందే. పరీక్షలు జరుగుతాయా.. లేదా అన్న మీమాంస కూడా పరీక్షకు రాకపోవడానికి ఓ కారణమని కొందరు భావిస్తున్నారు.
News February 23, 2025
నెల్లూరు: ప్రశాంతంగా ముగిసిన CM పర్యటన

నెల్లూరులోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో ఆదివారం టీడీపీ నాయకుడు బీద రవిచంద్ర కుమారుడి వివాహం జరిగింది. ఈ వేడుకకు సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా వచ్చారు ఈ సందర్భంగా నెల్లూరులో జిల్లా ఎస్పీ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సీఎం పర్యటనను విజయవంతం చేశారు. దీంతో అందరికీ జిల్లా ఎస్పీ దన్యవాదాలు తెలియజేశారు.