News February 3, 2025
నెల్లూరు: ‘ప్రాక్టికల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించండి’

5వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మొదటి విడత ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని నెల్లూరు ఆర్ఐవో డా. శ్రీనివాసులు అన్నారు. సోమవారం ఆయన కార్యాలయంలో సంబంధిత ఎగ్జామినర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు, ప్రాక్టికల్ సామాగ్రిని క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు.
Similar News
News November 18, 2025
ముత్తుకూరు హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం రొయ్యలపాలెంలో జరిగిన హత్య కేసులో ముద్దాయి పాముల శీనయ్యకు జీవిత ఖైదుతోపాటు రూ.2వేలు జరిమానా విధిస్తూ నెల్లూరు 3rd ADJ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. 2022 సం. ఏప్రిల్ 24న ముద్దాయి తన అన్నతో ఆస్తి విషయంలో గోడవ పడి అతని తలమీద కొట్టి ఇంటిని కాల్చి అతి కిరాతకంగా హత్య చేశాడు. తగిన సాక్ష్యాలను ప్రాసిక్యూషన్ కోర్టు ముందు ఉంచడంతో నేరం రుజువై శిక్ష ఖరారు చేశారు.

తోటపల్లి: ఇంటిని లాక్కొని బెదిరిస్తున్నారని ఫిర్యాదు.!

నల్లూరు జిల్లా తోటపల్లి గూడూరుకి చెందిన తన ఇంటిని లాక్కొని అల్లుడు బెదిరిస్తున్నారని వృద్ధుడు సోమవారం పోలీస్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. తన పెద్ద అల్లుడు శ్రీనివాసులురెడ్డి ఇంటికి తాళంవేసి, ఇంటి నుంచి తరిమేసి చంపుతానని బెదిరిస్తున్నాడన్నారు. తనకు మగ పిల్లలులేరని, ఇద్దరు ఆడపిల్లలని, భార్య చనిపోయారని, విచారించి త్వరితగతిన న్యాయం చేయాలని కోరారు.