News February 3, 2025
నెల్లూరు: ‘ప్రాక్టికల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించండి’

5వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మొదటి విడత ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని నెల్లూరు ఆర్ఐవో డా. శ్రీనివాసులు అన్నారు. సోమవారం ఆయన కార్యాలయంలో సంబంధిత ఎగ్జామినర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు, ప్రాక్టికల్ సామాగ్రిని క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు.
Similar News
News January 22, 2026
నెల్లూరు: ఆగని తల్లుల కడుపు‘కోత’.!

జిల్లాలో సిజేరియన్ ప్రసవాలు దారుణంగా పెరిగిపోతున్నాయి. సాధారణ ప్రసవం అయ్యే అవకాశం ఉన్నా డబ్బుల కక్కుర్తితో డాక్టర్లు కత్తికి పనిచెబుతున్నారు. జిల్లాలో ఏటా 10 వేల వరకు ప్రసవాలు జరుగుతుండగా, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 30 వేల వరకు ఉంది. 2024-25 మధ్య దాదాపు 11 వేల వరకు సిజేరియన్‌లు జరిగాయట. ప్రైవేట్ ఆసుపత్రుల్లో సరైన నిఘా లేకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందట. దీనిపై DMHO సుజాత సైతం ఆందోళన వ్యక్తం చేశారు.
News January 22, 2026
నెల్లూరు: ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లా న్యాయసేవాధికార సంస్థలో పలు పోస్టుల్లో పని చేసేందుకు అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా జడ్జి జి.శ్రీనివాస్ తెలిపారు. డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంటాఫీస్ కో-ఆర్డినేటర్ ఒక పోస్ట్, రికార్డు అసిస్టెంట్ నాలుగు పోస్టులు ఉన్నట్లు తెలిపారు. ఆసక్తిగలవారు తమ దరఖాస్తులను ఈ నెల 27లోపు పంపాలని కోరారు. మరిన్ని వివరాలకు కార్యాలయాన్ని పనివేళల్లో సంప్రదించాలని సూచించారు.
News January 22, 2026
పరిశ్రమలకు వసతులు కల్పించాలి: నెల్లూరు కలెక్టర్

నెల్లూరు జిల్లాలో ఏర్పాటు కానున్న పరిశ్రమలకు మౌలిక వసతులను త్వరితగతన కల్పించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. జిల్లాలో పెద్దఎత్తున పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయని చెప్పారు. ఇటీవల విశాఖలో నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో 14 మంది పారిశ్రామికవేత్తలు నెల్లూరులో పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు చేసుకున్నారని చెప్పారు. వారికి అవసరమైన వసతులు కల్పించాలని ఆదేశించారు.


