News March 19, 2025

నెల్లూరు: ప్రియురాలి గురించి మాట్లాడాలని పిలిచి హత్య

image

నెల్లూరు పొద‌ల‌కూరు రోడ్డులో చింటూ అనే వ్యక్తి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆరుగురు నిందితుల్ని వేదాయ‌పాళెం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. కృష్ణ సాయి అనే నిందితుడికి మృతుడికి మ‌ధ్య వివాదం ఉంది. ఈ నేపథ్యంలో 14న చింటూకి ఫోన్ చేసి తన ప్రియురాలి గురించి మాట్లాడాలని పిలిపించి కత్తులతో పొడిచి హ‌త్య చేశారు.

Similar News

News March 19, 2025

మంత్రివ‌ర్గ ఉప సంఘం భేటీలో నెల్లూరు మంత్రులు

image

అమరావతిలోని సచివాలయంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘం బుధవారం భేటీ అయ్యింది. ఈ భేటీకి నెల్లూరు మంత్రులు ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, పొంగూరు నారాయ‌ణ హాజ‌ర‌య్యారు. భూ పరిపాలన సంస్కరణలపై వారు చ‌ర్చించారు. ప్ర‌ధానంగా మంత్రి వ‌ర్గ ఉప సంఘంలో ఫ్రీ హోల్డ్ భూములపై చ‌ర్చ సాగింది.

News March 19, 2025

ప్రైవేట్ బ్యాంక‌ర్లు భాగ‌స్వామ్యం కావాలి: నెల్లూరు జేసీ

image

ఎంఎస్‌ఎంఈ రుణాలతో అన్ని రంగాల ఆర్థిక పరిపుష్టి సాధ్యమని, ఎంఎస్‌ఎంఈ రుణాల మంజూరులో ప్రైవేటు బ్యాంకర్లు తప్పనిసరిగా భాగస్వామ్యం కావాలని జాయింట్‌ కలెక్టర్‌ కె కార్తీక్‌ కోరారు. బుధవారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో జిల్లాస్థాయి బ్యాంకర్ల సమితి సమావేశం జేసీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడారు.

News March 19, 2025

తెడ్డుపాడు హైవేపై ప్రమాదం.. ఒకరు మృతి

image

దుత్తలూరు మండలం తెడ్డుపాడు – నర్రవాడ జాతీయ రహదారి ప్రాంతంలో రాత్రి 11 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తెడ్డుపాడు ఎస్సీ కాలనీకి చెందిన మేలింగి సురేశ్ ( 32 )అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. ఆగి ఉన్న లారీని బైక్‌పై వస్తున్న సురేశ్ ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. నర్రవాడ నుంచి తెడ్డుపాడు ఎస్సీ కాలనీకి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.

error: Content is protected !!