News July 26, 2024
నెల్లూరు: ప్రేమ జంట విషయంలో వాగ్వాదం
ప్రేమజంట విషయమై నడిరోడ్డుపై వాగ్వాదం జరిగింది. నెల్లూరు జిల్లా కలిగిరి పోలీస్ స్టేషన్‌కు ఓ ప్రేమజంట వచ్చింది. ఇరువురు బంధువులు కూడా అక్కడికి భారీగా చేరుకున్నారు. స్టేషన్ నుంచి అమ్మాయిని తీసుకెళ్లే ప్రయత్నం చేయడంతో ఇరువర్గాల మధ్య హైడ్రామా నడిచింది. దీంతో రోడ్డుపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు బంధువులను చెదరగొట్టి ట్రాఫిక్ క్లియర్ చేశారు. అనంతరం అమ్మాయిని పోలీసులు అదుపులో తీసుకున్నారు.
Similar News
News January 17, 2025
‘రిపబ్లిక్ డే వేడుకలు సమర్ధవంతంగా నిర్వహించాలి’
76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఘనంగా నిర్వహించేందుకు పక్కాగా ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ఎస్పీ మణికంఠ చందోలు, జేసీ శుభం బన్సల్ పాల్గొని మాట్లాడారు. ఈసారి జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
News January 17, 2025
2 నెలల పాటు అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్ నిలిపివేత
రాష్ట్రవ్యాప్తంగా రెండు నెలల పాటు అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్ నిలిపివేస్తున్నట్లు జిల్లా రిజిస్టర్ బాలాంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర రిజిస్ట్రేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి సిసోడియా ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి సహకరించాలని కోరారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు ఉత్తర్వులు జారీ చేశామన్నారు.
News January 17, 2025
నెల్లూరు: ఆర్నెల్ల క్రితమే పెళ్లైంది.. ఇంతలోనే విషాదం
సరదాగా గడిపి సేదతీరేందుకు వెళ్లిన ముగ్గురిని కడలి బలితీసుకుంది. ప్రకాశం జిల్లాకు చెందిన మాధవ(25)కు, నెల్లూరు జిల్లా, కందుకూరు(M), అనంతసాగరానికి చెందిన నవ్వతో ఆర్నెల్ల క్రితం పెళ్లి అయ్యింది. సంక్రాంతి సందర్భంగా బంధువులు, స్నేహితులతో కలిసి వారు పాకల బీచ్‌కి వెళ్లారు. ఈ క్రమంలో అలల్లో చిక్కుకుని మాధవ, నవ్య సోదరి యామిని, మాధవ బాబాయ్ కుమార్తె జెస్సికా మృతి చెందారు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.