News December 25, 2024
నెల్లూరు: ప్రేమ పేరుతో మోసం.. 10 ఏళ్ల జైలుశిక్ష

ప్రేమపేరుతో మోసం చేసిన యువకుడికి జైలుశిక్ష పడింది. సూళ్లూరుపేట సాయినగర్‌కు చెందిన భానుప్రకాశ్(23) ఓ బాలికను ప్రేమిస్తున్నానని చెప్పి హైదరాబాద్ తీసుకెళ్లి అక్కడ లైంగిక దాడి చేశాడు. ఈ ఘటనపై పోక్సో కేసు నమోదైంది. భానుప్రకాశ్‌తో అతడి బంధువులు వెంకటేశ్వర్లు(46), సుభాషిణి(40), స్వాతి(22), రమేశ్(29), మాలకొండయ్య(40)కు జడ్జి సిరిపిరెడ్డి సుమ పదేళ్ల జైలుశిక్ష, రూ.20 వేలు జరిమానా విధిస్తూ తీర్పుఇచ్చారు.
Similar News
News October 25, 2025
నుడా వైస్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన జేసీ

నుడా వైస్ ఛైర్మన్‌గా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆయనకు అభినందనలు తెలిపారు. బొకే అందజేసి శాలువతో సత్కరించారు. నుడా సంస్థ అభివృద్ధి దిశగా పయనించేందుకు సహాయ సహకారాలు అందించాలని కోటంరెడ్డి కోరారు. అనంతరం నుడా ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై వారు చర్చించుకున్నారు.
News October 24, 2025
వరి A గ్రేడ్ రకానికి రూ.2,389 మద్దతు ధర

కేంద్ర ప్రభుత్వం రబీ పంటలకు మద్దతు ధర(క్వింటాకు) ప్రకటించింది. వరికి A గ్రేడ్ రకానికి రూ.2389, సాధారణ రకానికి రూ.2369 చెల్లించనున్నారు. మొక్కజొన్నకు రూ.2400, పత్తిపొడవు రకం రూ. 8110, మినుములు రూ.7800, పెసలు రూ.8768, కందులు రూ.8000, జొన్నలు రూ.3699, నువ్వులు రూ.9846, సజ్జలు రూ.2775, రాగులు రూ.4886, వేరుశనగకు రూ.7263 చొప్పున మద్దతు ధరలను ప్రకటించింది. పోస్టర్‌ను JC వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు.
News October 24, 2025
జిల్లాను అగ్రపథంలో నిలుపుదాం: మంత్రి ఆనం

జిల్లాను అన్నీ రంగాల్లో ముందు నిలపాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కలెక్టర్ హిమాన్షు శుక్లాకు సూచించారు. ఈ మేరకు కలెక్టర్ మంత్రిని కలిసి అభివృద్ధి, సంక్షేమ అమలు తీరుపై, వర్షాలకు చేపట్టిన ముందస్తు చర్యలను వివరించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులను సమన్వయం చేసుకుంటూ జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి కోరారు.


