News August 28, 2024
నెల్లూరు : ఫోర్జరీ కేసులో కొనసాగుతున్న విచారణ

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సంతకాల ఫోర్జరీ కేసులో పోలీసు అధికారులు విచారణ వేగవంతం చేశామన్నారు. ఇప్పటికే ఈ కేసులో నగరపాలక సంస్థ టీపీఓ దేవేంద్రను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం నగర డీఎస్పీ డి. శ్రీనివాసరెడ్డి కార్పొరేషన్ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ సెక్షన్, నుడా కార్యాలయాల్లో విచారణ చేపట్టారు. పలు కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
Similar News
News February 22, 2026
నెల్లూరు: జైల్లో పొక్సో కేసు నిందితుడి మృతి.!

నెల్లూరు సెంట్రల్ జైల్లో పొక్సో కేస్ నిందితుడు మట్టి సుబ్బారావు (58) ఇవాళ(ఆదివారం) తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందారు. విజయవాడ భవానిపురానికి చెందిన సుబ్బారావు పది నెలలుగా ఇక్కడ శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో శిక్ష అనుభవిస్తూ చనిపోయాడు. మృతదేహానికి ఆర్డీవో, MRO, వెంకటాచలం పోలీసులు సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు.
News February 22, 2026
నెల్లూరు: మల్టీప్లెక్స్‌ల్లో “తెరచాటు” దోపిడి!

నెల్లూరువాసులకు ఆదివారం వచ్చిందంటే సినిమాలు, బీచ్‌లు, పార్కులకు కుటుంబ సమేతంగా వెళ్తుంటారు. సినిమా ప్రేమికులు అయితే కుటుంబ సమేతంగా మల్టిప్లెక్స్‌లో సినిమాకి వెళ్లాలంటే రూ.2వేలు నుంచి రూ.4వేలు వరకు ఖర్చు అవుతుందని వాపోతున్నారు. టికెట్లు రూ.వెయ్యి లోపు అయినా, తినుబండారాలకు రూ.2వేలకు పైన ఖర్చు అవుతుందని అంటున్నారు. అధికారులు ధరల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
News February 22, 2026
నెల్లూరు: ఆ మంత్రి రూటే వేరయా..!

జిల్లాలో మంత్రి నారాయణ రూటే సెపరేట్ అంట. ఆయనకు పార్టీ శ్రేణుల సమన్వయంతో పనే లేదంట. కేవలం అతని అనుచరులు, అభివృద్ధి పనులే ముఖ్యమంటూ మందుకెళ్తున్నారట. మరోవైపు మంత్రి హోదాలో ఉండి పార్టీని సమన్వయం చేయడంలో విఫలమయ్యారని ఆ పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. కాగా.. నెల్లూరులో జరుగుతున్న అభివృద్ధి మంత్రికి ప్లస్ పాయింట్‌గా మారుతుందడం కలిసిచ్చే అవకాశం. అయినా పార్టీలో జోష్ నింపడంపై దృష్టి సారించాలని అంటున్నారు.


