News August 30, 2024

నెల్లూరు: ఫోర్జరీ కేసులో టీపీఓ అరెస్ట్

image

నగరపాలక సంస్థ కమిషనర్ల సంతకాల ఫోర్జరీ కేసులో మరో టౌన్ ప్లానింగ్ అధికారి ప్రవీణ్ కుమార్‌ను నగర డీఎస్పీ శ్రీనివాసరెడ్డి గురువారం అరెస్ట్ చేశారు. కమిషనర్ల సంతకాల ఫోర్జరీ కేసులో ఇద్దరు టీపీఓలు, మేయర్ భర్త జయవర్ధన్, ఆయన సహాయకుడు, ఇద్దరు సచివాలయ ఉద్యోగులు, ప్రైవేట్ ఇంజినీర్ పై దర్గామిట్ట పోలీసులు కేసు నమోదు చేసిన విషయం విదితమే.

Similar News

News December 5, 2025

నెల్లూరు: ప్రభుత్వ అధికారి సస్పెండ్

image

దుత్తలూరు-1 VROగా పని చేస్తున్న చింతలచెరువు శ్రీనివాసులును సస్పెండ్ చేస్తూ జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ వివరాలను తహశీల్దార్ యనమల నాగరాజు వెల్లడించారు. గతంలో ఏరుకొల్లు VROగా పనిచేస్తున్న సమయంలో అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందకుండా చేయడంతో పాటు వారి పట్ల దురుసుగా ప్రవర్తించారని గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

News December 5, 2025

నెల్లూరు: 2.94 లక్షల చిన్నారులకు పోలియో చుక్కలే లక్ష్యం.!

image

నెల్లూరు జిల్లాలో ఈనెల 21వ తేదీన పోలియో చుక్కల కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. 0 నుంచి 5 సంవత్సరాలలోపు ఉన్న 2,94,140 మంది చిన్నారులకు ఈ చుక్కల మందును వేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ సన్నద్ధం అవుతోంది. జిల్లా వ్యాప్తంగా 52 PHC, 28 UPHCల పరిధిలో 80 కేంద్రాలను ఏర్పాటు చేసేలా కార్యాచరణ రూపొందించారు.

News December 5, 2025

అటు వెళ్లకండి.. నెల్లూరు జిల్లా వాసులకు అలర్ట్.!

image

నెల్లూరు జిల్లాలోని అన్నీ చెరువులు, రిజర్వాయర్లు, దిత్వా తుఫాను ప్రభావంతో నిండుకుండల్లా ఉన్నాయి. దీంతో పలుచోట్ల పోలీసులు పహారా కాస్తున్నారు. మరోవైపు రెవెన్యూ సిబ్బంది ప్రజలను చెరువులవద్దకు వెళ్లకుండా అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో నీటి ప్రవాహానికి ముగ్గురు కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. వరద ప్రాంతాల్లో ప్రజలు మోహరించకుండా బారికేడ్లు, పెట్రోలింగ్ వాహనాల ద్వారా గస్తీ కాస్తున్నారు.