News July 31, 2024
నెల్లూరు: బంతి తోటలో అశ్లీల ఫ్లెక్సీలు

వరికుంటపాడు మండలం తిమ్మా రెడ్డిపల్లి సమీపంలో బంతి తోటలో హీరోయిన్ల అశ్లీల చిత్రాలతో ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. భోగ్యంవారిపల్లికి చెందిన ఓ రైతు తన పొలంలోని పంటకు దిష్టి తగలకుండా ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ తోట నేషనల్ హైవే పక్కనే ఉండటంతో అటుగా వెళ్లే ప్రయాణికులు ఈ ఫ్లెక్సీలను చూసి అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాటిని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
Similar News
News October 28, 2025
నెల్లూరులో విద్యార్థుల మిస్సింగ్.. గూడూరులో ప్రత్యక్షం

ధనలక్ష్మిపురంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న రాకేష్, లోకేష్ ఈ నెల 23న అదృశ్యమయ్యారు. ప్రిన్సిపల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా.. వారిద్దరూ గూడూరులో ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. నెల్లూరు నుంచి తిరుపతి వెళ్లిన ఆ ఇద్దరు విద్యార్థులు గూడూరులో ఉండగా.. సాంకేతికత ఆధారంగా వారిని పోలీసులు గుర్తించారు.
News October 28, 2025
భారీ వర్షాలు.. జిల్లాలో కంట్రోల్ రూం ఫోన్ నంబర్లు ఇవే.!

☞ నెల్లూరు కలెక్టరేట్: 086102331261, 7995576699
☞ కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయం-7601002776
☞ నెల్లూరు RDO ఆఫీసు- 9849904061
☞ ఆత్మకూరు RDO ఆఫీసు- 9100948215
☞ కావలి RDO ఆఫీసు-7702267559
☞ రాష్ట్ర టోల్ఫ్రీ నంబర్లు 112, 1070, 1800-425-0101.
☞ జిల్లా యాంత్రాంగం తుఫాన్ ధాటికి ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉంది.
News October 28, 2025
కృష్ణపట్నం పోర్టులో 5వ ప్రమాదపు హెచ్చరిక జారీ

‘మెంథా’ తుఫాన్ నేపథ్యంలో కృష్ణపట్నం పోర్టులో సోమవారం సాయంత్రం 5వ ప్రమాదవ హెచ్చరిక ప్రకటన చేశారు. తుపాను 50 నుంచి 150 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు 5, 6వ నంబరు ప్రమాదకర సూచికలుగా పరిగణిస్తారు. గాలులు, అలలు పోర్ట్ పరిసరాల్లో ప్రభావం చూపుతాయని అర్థం. ఈ నంబర్ల హెచ్చరికలు జారీచేస్తే పోర్టులో కార్యకలాపాలన్నీ నిలిపేయాలి. కృష్ణపట్నం పోర్టులో కార్మికులకు సెలవు ఇవ్వకపోవడంపై పలువురు మండిపడుతున్నారు


