News December 21, 2024

నెల్లూరు: బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడి

image

బాలికను కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడిన వ్యక్తికి శిక్ష పడింది. బాలాయపల్లిలోని ఓ బాలికను జయంపులో దుకాణం నడుపుతున్న ఓజిలి(M) ఇనుగుంటకు చెందిన సుబ్బారావు ప్రేమ పేరుతో నమ్మించాడు. సుబ్రహ్మణ్యం, వెంటకయ్య, వాణి సహయంతో 2015లో బాలికను కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడ్డాడు. నేరం రుజువు కావడంతో నలుగురికి పదేళ్ల జైలు, రూ.22వేలు జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి సిరిపిరెడ్డి సుమ నిన్న తీర్పుచెప్పారు.

Similar News

News January 26, 2025

గణతంత్ర వేడుకలకు ముస్తాబైన నెల్లూరు కలెక్టరేట్

image

76వ గణతంత్ర వేడుకలకు నెల్లూరు కలెక్టరేట్ ముస్తాబైంది. త్రివర్ణ పతాక రంగులతో అలంకరించిన విద్యుత్ దీపాలంకరణలతో వెలిగిపోతున్నది. గణతంత్ర వేడుకల సందర్భంగా నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గిరిజన సంక్షేమ శాఖ, ఐసీడీఎస్, ఇతర ప్రభుత్వ శాఖల పథకాలకు సంబంధించిన అంశాలను ప్రదర్శించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. నేడు నెల్లూరులో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు.

News January 25, 2025

నెల్లూరు: 104 అంబులెన్సుల్లో డ్రైవర్ ఉద్యోగాలు

image

కొండాపురం, లింగసముద్రం మండలాలతో పాటు నెల్లూరు, కావలి బఫర్ 104 అంబులెన్సుల డ్రైవర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిస్ట్రిక్ట్ మేనేజర్ వెంకటరెడ్డి తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులై హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు అర్హులని వెల్లడించారు. అర్హత కలిగిన వారు నెల్లూరు జీజీహెచ్ ఆవరణలోని 104 కార్యాలయంలో జనవరి 27, 28 తేదీల్లో సంప్రదించాలని సూచించారు.

News January 25, 2025

దుత్తలూరు: మసిబారుతున్న పసి బతుకులు

image

దుత్తలూరు మండలంలోని చిన్నారులు పాఠశాలలకు వెళ్లి చదువుకోవాల్సిన వయసులో బొగ్గుబట్టీలు, ఇటుక బట్టీలు, కంకర క్రషర్ల వద్ద పనిచేస్తూ  జీవనం గడుపుతున్నారు. కాలుష్యం నడుమ వారి ఆరోగ్యం దెబ్బతింటున్న పట్టించుకునే అధికారులు కరువయ్యారని పలువురు ఆరోపిస్తున్నారు. బట్టీల వద్ద కార్మిక చట్టాలు అమలుకావటం లేదు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారని పలువురు వాపోయారు.