News February 19, 2025
నెల్లూరు: బాలికపై లైంగిక దాడి.. నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష

నెల్లూరు నగరంలోని కపాడిపాలెంకు చెందిన షేక్ కరీముల్లాకు పోక్సో కేసులో పదేళ్ల జైలు శిక్ష రూ.20వేలు జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి సిరిపిరెడ్డి సుమ తీర్పును వెలువరించారు. ఫిబ్రవరి 4, 2015 నగరంలోని సంతపేట చెందిన ఓ బాలికను ప్రేమ పేరుతో నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. గుడ్ ట్రైల్ మానిటరింగ్ వ్యవస్థ ద్వారా ముద్దాయిలకు శిక్ష పడేలా చేసిన సిబ్బందిని జిల్లా ఎస్పీ జీ కృష్ణ కాంత్ అభినందించారు.
Similar News
News April 17, 2026
నెల్లూరు: వాట్సాప్‌లో ఒక్క క్లిక్.. రూ.2.58 లక్షలు హాంఫట్

వాట్సాప్‌లో ‘సేవింగ్స్ ఆన్‌లైన్ మార్కెటింగ్’ పేరుతో వచ్చిన సందేశాన్ని క్లిక్ చేసిన ఓ యువతి రూ. 2.58 లక్షలు పోగొట్టుకుంది. ఈ ఘటన నవబ్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నితేశ్ అనే వ్యక్తి ఓ యువతికి పంపిన APK ఫైల్‌ను ఓపెన్ చేయగానే ఆమె బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యింది. గుర్తుతెలియని లింకులు, ఫైల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

కూటమి పాలనలో రైతుకు కన్నీరే: మాజీ మంత్రి కాకాణి

కూటమి పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. నెల్లూరు జిల్లా వరిగొండలో పర్యటించిన ఆయన, గతంలో ధాన్యం పుట్టి రూ.25 వేలుంటే, నేడు గిట్టుబాటు ధర లేక రూ. 16 వేలకు అమ్మి రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరు, ఎరువుల అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వ్యవసాయం పట్ల ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యానికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.