News March 29, 2024

నెల్లూరు: బీఈడీ కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లు

image

నెల్లూరు నగరం సంతపేటలోని ప్రభుత్వ బీఈడీ కళాశాలలో వివిధ కోర్సుల్లో మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ వేణుగోపాల్ తెలిపారు. ఎడ్ సెట్ అర్హత సాధించి ఎక్కడా అడ్మిషన్ పొందని విద్యార్థులు ఏప్రిల్ 2వ తేదీ వరకు కళాశాలలో జరిగే స్పాట్ కౌన్సిలింగ్ లో పాల్గొనాలని సూచించారు. రిజిస్ట్రేషన్, కాలేజీ ఫీజుతో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లతో రావాలని కోరారు.

Similar News

News February 8, 2026

నెల్లూరు: మురుగుతున్న MP LADS

image

నెల్లూరు జిల్లా నుంచి ప్రాతినిద్యం వహిస్తున్న ఎంపీలైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీద మస్తాన్ రావులకు భారత ప్రభుత్వం MP LADS ను కేటాయిస్తుంది. వేమిరెడ్డికి రూ. 9.80 కోట్లను కేటాయించగా.. రూ. 5.06 కోట్ల నిధులు మిగిలి ఉన్నాయని సమాచారం. బీద మస్తాన్ రావుకు రూ.12.22 కోట్లు ఇవ్వగా రూ.3.37 కోట్లకు పనులు చేపట్టారు. కనీసం కొన్ని పనులు కూడా మొదలెట్టలేదంటే ఎలా ఖర్చు చేస్తారోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు.

News February 7, 2026

నెల్లూరు: రైలు ఢీకొని మహిళ స్పాట్ డెడ్

image

మనుబోలు రైల్వే స్టేషన్ ఉత్తరం వైపు ఫ్లాట్ ఫామ్ చివరన చెన్నై నుంచి విజయవాడ వెళ్లే లైన్‌లో గుర్తుతెలియని మహిళ పట్టాలు దాటే క్రమంలో ప్రమాదవశాత్తు రైలు ఢీకొని శనివారం సాయంత్రం మృతి చెందింది. వయస్సు సుమారు 50-55 ఏళ్లు ఉండొచ్చని, 5.0అడుగుల ఎత్తు కలిగి చాయా రంగు కలిగి ఉందని రైల్వే ఎస్సై హరి చందన తెలిపారు. మృతురాలు సిమెంట్ రంగుపై బులుగు రంగు సిల్క్ చీర, ఆకుపచ్చ పావడాను ధరించి ఉందని అన్నారు.

News February 7, 2026

సోమిరెడ్డికి కాకాణి సవాల్

image

నెల్లూరు జిల్లా ఇరిగేషన్ శాఖ అవినీతికి అడ్డాగా మారిందని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రైతులను అడ్డం పెట్టుకుని పనులు చేయకుండానే కోట్ల రూపాయల బిల్లులు దోచుకున్నారన్నారు. ఈ అక్రమాలపై సీఎంకు లేఖ రాసినా స్పందన లేదని మండిపడ్డారు. అవినీతి ప్రశ్నిస్తే దాడులు, బెదిరింపులు చేస్తున్నారని, విజిలెన్స్ విచారణకు సిద్ధమా అని సోమిరెడ్డికి సవాల్ విసిరారు.