News March 30, 2024
నెల్లూరు: బొల్లినేని అడుగులు ఎటో !
ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు రాజకీయ అడుగులు ఆసక్తికరంగా మారాయి. చంద్రబాబు పర్యటనలో మొక్కుబడిగా పాల్గొని కీలక సమావేశాలకు దూరంగా ఉండటం టీడీపీ వర్గాల్లో కలకలం రేపుతోంది. 2012 ఉప ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన ఆయన ఓడారు.2014 ఎన్నికల్లో గెలిచారు. 2019లో ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం ఆయనకు టికెట్ నిరాకరించింది. కాగా బీజేపీ జాతీయ నేతలతో బొల్లినేనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
Similar News
News January 16, 2025
ఉదయగిరిలో జోరుగా కోడిపందేలు
సంక్రాంతి పండగ సందర్భంగా ఉదయగిరి మండలంలోని పలు గ్రామాల్లో జోరుగా కోడిపందేలు జరుగుతున్నాయి. పోలీసు అధికారుల ఆదేశాలు ఉన్నప్పటికీ బేఖాతర్ చేస్తూ కోడిపందేలు నిర్వహించారు. మండలంలోని జి. చెరువుపల్లి, జి చెర్లోపల్లి, వెంకట్రావుపల్లి, కృష్ణంపల్లి పలు గ్రామాల్లో ఏర్పాటుచేసిన కోడిపందేలను తిలకించేందుకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
News January 16, 2025
పర్యాటకులకు అవసరమైన ఏర్పాట్లు చేయాల: జేసీ
పక్షుల పండుగకు వచ్చే పర్యాటకులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా ఆదేశించారు. బుధవారం ఆయన నేలపట్టు పక్షుల కేంద్రంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏ శాఖకు సంబంధించిన అధికారులు ఆ శాఖకు సంబంధించిన ఏర్పాట్లను చేపట్టాలన్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకొని చెరువు కట్టపై వన్ వే కోసం భారీ కేట్స్, వాహనాల రాకపోకలకు రహదారులపై పోలీస్ అవుట్ పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు.
News January 15, 2025
నెల్లూరులో చికెన్, మటన్ రేట్లు ఎలా ఉన్నాయంటే..
కనుమ పండుగ సందర్భంగా నెల్లూరు జిల్లాలో చికెన్, మటన్ ధరలు ఇలా ఉన్నాయి. broiler live – రూ.120, broiler retail rate -రూ.170, skin chicken -రూ.220, skinless chicken -రూ.240, lollipop -రూ.250, leg piece -రూ.260, boneless -రూ.360 గా ఉన్నాయి. మటన్ ధరలు మాత్రం రూ.800 నుంచి రూ.1000 వరకు ఉన్నాయి.
గమనిక.. ఒక్కొ ప్రాంతంలో ఒక్కోవిధంగా ధరలు ఉండొచ్చు.