News April 11, 2025
నెల్లూరు: బ్యాంక్ ఉద్యోగం పేరిట మోసం

నెల్లూరు కరెంట్ ఆఫీస్ సెంటర్‌కు చెందిన శ్రీదేవి గతంలో ఓ గోల్డ్‌లోన్ సంస్థలో పనిచేశారు. కలువాయి(M) చవటపల్లికి చెందిన రమ్య లోన్‌కు వెళ్లి శ్రీదేవిని పరిచయం చేసుకుంది. డబ్బులు కట్టడంతో తనకు HYDలో SBI బ్రాంచ్ మేనేజర్ పోస్ట్ వచ్చిందని రమ్య నమ్మించడంతో శ్రీదేవి ఉద్యోగానికి రూ.9లక్షలు ఇచ్చింది. ఉద్యోగాలు తీసిచ్చే అతను చనిపోయాడంటూ రమ్య తిరిగి డబ్బులు ఇవ్వకపోవడంతో శ్రీదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Similar News
News April 25, 2025
30 నుంచి VSUలో టోర్నమెంట్

కాకుటూరు దగ్గర ఉన్న విక్రమ సింహపురి యూనివర్సిటీలో ఈనెల 30 నుంచి ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్ జరగనుంది. ఈ నేపథ్యంలో బోధన, బోధనేతర సిబ్బందితో వీసీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల నుంచి ప్రతినిధులు వస్తారని చెప్పారు. ఈ టోర్నీని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతిఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని కోరారు.
News April 25, 2025
NLR: నేటి నుంచి నోషనల్ ఖాతాల స్పెషల్ డ్రైవ్

నెల్లూరు జిల్లాలో 95వేలకు పైగా ఉన్న నోషనల్ ఖాతాల పరిష్కారానికి ఈనెల 25 నుంచి నెల రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్ తెలిపారు. 1,84,288 సర్వే నంబర్లలోని 95,065 నోషనల్ ఖాతాలకు సంబంధించి రోజూ జిల్లాలోని నాలుగు డివిజన్ల నుంచి రెండేసి మండలాల చొప్పున పరిశీలిస్తారు. రోజూ 8 మండలాల నోషనల్ ఖాతాలను పరిశీలించి రైతుల సమస్యలు పరిష్కరిస్తారు.
News April 24, 2025
NLR: రేషన్ డీలర్ల వద్దకు పరుగులు

రేషన్ ఇంటికి రావాలంటే ప్రభుత్వం ఈకేవైసీ తప్పనిసరి చేసింది. రేషన్‌కార్డులో ఉన్న ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేయించుకోవాలని ఆదేశించడంతో నెల్లూరు జిల్లాలోని లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. తమకు ఈకేవైసీ చేయండి అంటూ చాలామంది డీలర్ల వద్దకు పరుగులు పెడుతున్నారు. ఈనెల 30వ తేదీ వరకు గడువు ఉంది. ఈకేవైసీ స్టేటస్ ఇంటర్నెట్లోనూ చూసుకోవచ్చని అధికారులు సూచించారు.