News October 8, 2024
నెల్లూరు: భక్తిశ్రద్ధలతో కౌమారి పూజ
నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో కౌమారి పూజను మంగళవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అమ్మవారి స్వరూపంగా ఓ చిన్నారికి బాలత్రిపుర సుందరి అలంకారం చేసి పూజలు జరిపారు. అనంతరం ఆ చిన్నారి ఆశీస్సులు పొందేందుకు భక్తులు పోటీపడ్డారు. మరోవైపు బుధవారం మూలా నక్షత్రం సందర్భంగా శ్రీరాజరాజేశ్వరి అమ్మవారు సరస్వతిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు.
Similar News
News November 1, 2024
ఉదయగిరికి ఫస్ట్.. నెల్లూరు లాస్ట్
అపార్ నమోదులో జిల్లాలో ఉదయగిరి తొలి స్థానంలో నిలిచిందని MEO- 2 తోట శ్రీనివాసులు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. అపార్ నమోదులో జిల్లాలోని 38 మండలాలకు గాను ఉదయగిరి 58.76శాతంతో మొదటి స్థానం దక్కిందన్నారు. నెల్లూరు అర్బన్, రూరల్ చివరి స్థానాల్లో కొనసాగడం గమనార్హం. ఉదయగిరిని ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేసిన HM కార్యాలయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
News November 1, 2024
గూడూరు: తండ్రిని చంపిన కుమారుడు
గూడూరు నియోజకవర్గంలో శుక్రవారం మరో హత్య జరిగింది. వాకాడు మండలం శ్రీనివాసపురంలో తండ్రి చిన్న సుబ్బరామయ్యను కుమారుడే హత్య చేశాడు. తండ్రి అన్నం తింటున్న సమయంలో కర్రతో కొట్టడంతో తీవ్రగాయమైంది. ఘటనా స్థలంలోనే సుబ్బరామయ్య మృతిచెందాడు. కుమారుడు పరారీలో ఉన్నాడు. వాకాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిన్న రాత్రి ఇదే నియోజకవర్గంలోని చిల్లకూరు మండలంలో <<14501641>>హత్య <<>>జరిగిన విషయం తెలిసిందే.
News November 1, 2024
తడ: గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు అరెస్ట్
తడ రైల్వే స్టేషన్ నుంచి తమిళనాడుకు గంజాయి తరలిస్తున్న నలుగురు స్మగ్లర్స్‌ను తడ పోలీసులు ఇవాళ సాయంత్రం అరెస్ట్ చేశారు. రైల్వే స్టేషన్ పార్కింగ్ ప్లేస్ వద్ద బ్యాగ్స్‌తో ఉన్న నలుగురు అనుమానస్పదంగా ఉన్నారనే స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.5 లక్షలు విలువ చేసే 46 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో సీఐ, ఎస్సైలు ఉన్నారు.