News August 31, 2024

నెల్లూరు : భారీ వర్షాలు.. రైల్వే హెల్ప్ లైన్ నెంబర్లు

image

రాష్ట్రమంతటా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు కొన్ని రైళ్లను రూట్ మార్చినట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. వాటి వివరాల కోసం ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని హెల్ప్ లైన్ నెంబర్లను రైల్వే శాఖ ప్రకటించింది. నెల్లూరు- 7815909469, గూడూరు-08624-250795 నంబర్లకు సంప్రదించాలని పేర్కొంది.

Similar News

News February 8, 2025

నెల్లూరు: ప్రాక్టికల్ పరీక్షలకు సర్వం సిద్ధం

image

ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సైన్స్ ప్రాక్టికల్ పరీక్షలకు అన్ని సిద్ధంగా ఉన్నాయని RIO శ్రీనివాసులు తెలిపారు. శనివారం D.K బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎగ్జామినర్ల సమావేశంలో ప్రసంగిస్తూ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహణ కోసం అన్ని సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు.

News February 8, 2025

నెల్లూరు: ఇంజెక్షన్ వేస్తున్నట్లు నటించి నగలు చోరీ.. అరెస్ట్

image

నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్‌లోని ఓ వ్యక్తికి అనారోగ్యంగా ఉండడంతో ఇంజెక్షన్ వేసేందుకు కార్తీక్ అనే కాంపౌండర్ వచ్చాడు. ఇంజెక్షన్ వేస్తున్నట్లు నటిస్తూ సమీపంలో బంగారు ఆభరణాలు గమనించి చోరీకి పాల్పడ్డాడు. బంగారం దొంగిలించినట్లు గమనించిన ఉదయ శేఖర్ రెడ్డి దర్గామిట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులో తీసుకొని 95 గ్రాములు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

News February 8, 2025

నేడు కావలిలో జిల్లా కలెక్టర్ ఆనంద్ పర్యటన

image

నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ శనివారం కావలి పట్టణంలో పర్యటించనున్నారు. కలెక్టర్ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యాహ్నం 2:30 గంటలకు నెల్లూరు జిల్లా కలెక్టర్ కావలి సెల్ఫీ పాయింట్‌ను సందర్శిస్తారు. మధ్యాహ్నం 3.00 గంటలకు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వెంగళరావునగర్‌లో ప్రారంభిస్తారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు ఇందిరమ్మ కాలనీలో సిసి రోడ్లకు శంకుస్థాపన చేయనున్నారు. 

error: Content is protected !!