News September 19, 2024
నెల్లూరు: భార్యతో గొడవ.. భర్త సూసైడ్

భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన పెళ్లకూరు మండలంలో చోటుచేసుకుంది. సీఐ సంగమేశ్వరరావు వివరాలు ప్రకారం.. విజయనగరం జిల్లాకు చెందిన చంద్రశేఖర్ మెగా కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో వారు ఫొన్లో రోజూ గొడవపడేవారు. రాజుపాళెం అటవీప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ మునుస్వామి తెలిపారు.
Similar News
News November 23, 2025
నెల్లూరు: దీపావళి స్కీం పేరుతో రూ.73 లక్షలు టోకరా..?

కనకదుర్గమ్మ దీపావళి ఫండ్స్ స్కీం పేరుతో విలువైన వస్తువులు, బంగారు ఇస్తామని ఆశ చూపి సుమారు రూ.73 లక్షల మేర టోకరా వేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. గూడూరుకు చెందిన ప్రసాద్, పద్మావతి దంపతులు 3 రకాల స్కీముల పేరుతో నెలకు రూ.350, రూ.400, రూ.1200 చెల్లిస్తే కంచు బిందెతోపాటు, 20 రకాల విలువైన వస్తువులు ఇస్తామని నమ్మబలికారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో డబ్బులు వసూలు చేసి ఉడాయించడంతో మనుబోలు పోలీసులను ఆశ్రయించారు.
News November 23, 2025
కావలి: రైలు కింద పడి యువకుడి దుర్మరణం

కావలి జీఆర్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో కొడవలూరు రైల్వే స్టేషన్ వద్ద సుమారు 20-25 ఏళ్ల వయసు గల యువకుడు రైలు కింద పడి దుర్మరణం చెందాడు. యువకుడు ఆరంజ్ కలర్ హాఫ్ హ్యాండ్ T షర్ట్, బ్లూ కలర్ కట్ బనియన్, బ్లూ కలర్ షార్ట్ ధరించి ఉన్నాడు. ఆచూకీ తెలిసినవారు కావలి జీఆర్పీ పోలీసులను సంప్రదించగలరు.
News November 23, 2025
నెల్లూరు: కీచక ఉపాధ్యాయుడి అరెస్ట్

వరికుంటపాడు(M) తూర్పు బోయమడుగుల ప్రాథమికోన్నత పాఠశాలలో ఓ కీచక ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది జులై 1న పాఠశాలలోని విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి తల్లిదండ్రులు దేహశుద్ధి చేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ నుంచి ఉపాధ్యాయుడు పరారు కావడంతో పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. టీచర్ ఆచూకీ కోసం పోలీసులు గాలించి శనివారం అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచారు.


